Secondary Health Director In Govt Hospital Services Monitoring : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేని వైద్యులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. దీని కోసం ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. సెకండరీ హెల్త్ డైరెక్టర్ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తోంది. ఆస్పత్రికి వైద్యులు సమయానికి వచ్చారో లేదో తెలుసుకునేందుకు, వీడియో కాల్స్ చేస్తోంది. ఫోన్ కాల్స్‌కు స్పందించని వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
బెడ్ కష్టాలకు త్వరలోనే చెక్ - ప్రతి మంచం వద్ద ఐసీయూ వసతులు
ఇప్పటికే 22 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులిచ్చింది. సీసీ కెమెరాల ద్వారా సిబ్బందిని 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా రోగులకు ఫోన్ చేసి ఆసుపత్రుల్లో వైద్యుల అందుబాటు, వైద్య సేవలపై ఆరా తీస్తున్నారు. వైద్య సిబ్బంది రోగుల సమస్యలపై స్పందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సిరితో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి.
కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా గుంటూరు GGHలో అరుదైన ఆపరేషన్లు