Attractive Fencing To Sharadharadavanam of Anakapalli District : ఆ కంచెను చూడగానే పెన్సిళ్లతో దడి కట్టారని అనుకుంటారు అంతా. నిజానికి అవి పెన్సిల్లేనా? అందరు ఎందుకు అలా అనుకుంటున్నారంటే! కర్రలను పెన్సిళ్ల ఆకారంలో తయారు చేసి ఇలా విభిన్నంగా కంచెను ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి, నర్సీపట్నంల్లో అటవీశాఖ అధికారులు నగర వనాలను అభివృద్ధి చేస్తున్నారు.
ఖాళీ స్థలాల్లో చిన్నపాటి అడవిని సృష్టిస్తున్నారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం వద్ద పెంచిన అడవికి ‘శారదావనం’ అని పేరు పెట్టారు. ఆ వనం ముందుభాగంలో ఆకట్టుకునేలా కర్రలతో రక్షణ ఏర్పాటు చేశారు. ఆ కర్రలు పెన్సిల్ ఆకారంలో ఉండటం అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఆ పార్కుకి వెళ్తే డైనోసర్స్ నుంచి ఆదిమానవుని వరకు అన్నీ చూడొచ్చు!
'సీతాకోక చిలుకల వనం' - ప్లాస్టిక్ నిషేధానికి పర్యాటకుల నుంచి డిపాజిట్