తెలంగాణ

telangana

ETV Bharat / videos

హైవేపై కారు బీభత్సం- ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి- లైవ్ వీడియో - Car Accident In Tamil Nadu - CAR ACCIDENT IN TAMIL NADU

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 7:45 PM IST

Car Accident In Tamil Nadu : తమిళనాడులోని మధురైలోని జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.  

మధురైలోని తిరుమంగళం సమీపంలోని శివరకొట్టై నాలుగు లైన్ల రహదారిపై అతి వేగంగా వస్తున్న ఓ ఎస్​యూవీ అదుపు తప్పి ముందున్న బైక్​ను ఢీ కొట్టింది. అక్కడితో ఆగకుండా అంతే వేగంతో డివైడర్​ను దాటుకుని వెళ్లి మరో బైక్​ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఐదుగురు మృతి చెందగా, 8ఏళ్ల బాలిక చికిత్స పొందుతూ మరణించింది. మరో ముగ్గురు వ్యక్తుల తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది. విరుదునగర్​ జిల్లాలోని మారియమ్మన్​ ఆలయ పూమితి ఉత్సవాల్లో పాల్గొనేందుకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

ABOUT THE AUTHOR

...view details