International Kite and Sweet Festival At Parade Ground : రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో జరుగుతున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ ఆకట్టుకుంటోంది. భాగ్యనగరవాసులు భారీగా తరలివస్తున్నారు. మూడు రోజులు సాగిన ఈ కైట్ కైట్, స్వీట్ ఫెస్టివల్ ముగియనుంది.
ఆకట్టుకుంటున్న కైట్ ఫెస్టివల్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్ ఉత్సాహంగా కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాలతోపాటు అర్జెంటీనా, చైనా, ఇటలీ, సౌత్ కొరియా, సింగపూర్, శ్రీలంక సహా 29 దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ రకరాకాల పతంగులను ఎగరవేస్తున్నారు. రాత్రిళ్లు సైతం కనిపించే తారాజువ్వల్లాంటి పతంగులు ఆకాశంలో కనువిందు చేశాయి. నగర నలుమూలలనుంచి ప్రజలంతా ఇక్కడకు చేరుకుని వీటిని తిలకిస్తున్నారు.
ఫుడ్ అండ్ స్వీట్ స్టాల్స్ : సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఫుడ్ అండ్ స్వీట్ స్టాల్స్ నోరూరిస్తున్నాయి. 400 మంది మహిళలు మిఠాయిలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకత పొందిన ఆహారాలను ఫుడ్ స్టాల్స్‌లో అందుబాటులో ఉంచారు. భోజన ప్రియులు వాటిని ఆరగిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పండుగకు చాలా మంది ఊరెళ్లడంతో హైదరాబాద్‌లోని రోడ్లన్ని ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రధాన రహదారులు, కూడళ్ళు బోసిపోయాయి. మైత్రీవనం, పంజాగుట్ట, జూబ్లిహిల్స్ చెక్‌పోస్ట్, సనత్ నగర్, సోమాజీగూడ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు అరకొగా కనిపించాయి. మరో రెండు రోజల పాటు ఇదే వాతావరణం కనిపించే అవకాశముంది.
"మూడు రోజుల నుంచి కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. భారీగా జనం వచ్చి సంతోషంగా గడుపుతున్నారు. మా పోలీసులు కూడా ఇక్కడి వచ్చిన వారికి అన్ని సదుపాయాలు అందిస్తున్నారు. పార్కింగ్‌కు ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. ప్రత్యేకంగా ఆడవాళ్లకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించాము." -రష్మి పెరుమాల్, డీసీపీ
ఒకే దారంతో వెయ్యి గాలిపటాలు- ఈ కైట్ ఫ్యామిలీ కథ అదుర్స్!
పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ - ప్రారంభించిన మంత్రులు జూపల్లి, పొన్నం