ETV Bharat / state

పల్లె నుంచి పట్నంకు తిరుగుపయనమైన వారికి గుడ్ న్యూస్ - నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు! - SANKRANTI FESTIVAL RETURN RUSH

సొంతూళ్ల నుంచి తిరుగుప్రయాణమైన ప్రజలు - తిరిగి వచ్చే వారి కోసం ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక సర్వీసులు

special buses SANKRANTI RETURN RUSH
Sankranti Festival Return Rush (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 15, 2025, 1:59 PM IST

Updated : Jan 15, 2025, 2:21 PM IST

Sankranti Festival Return Rush : ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడిన వాళ్లు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిపోయారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా పచ్చని పల్లెల్లో బంధుమిత్రుల మధ్య సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి వెళ్లిపోవడంతో నగరం దాదాపు ఖాళీ అయిపోయింది. సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగుపయనమయ్యారు. వారి కోసం ఆర్టీసీ, రైల్వే సంస్థలు ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నాయి.

సొంతూళ్ల నుంచి తిరుగుప్రయాణమైన ప్రజలు : సంక్రాంతి పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే వారికోసం దక్షిణ మధ్య రైల్వే, టీజీఎస్ ఆర్టీసీ భారీ సంఖ్యలో సర్వీసులను నడిపించింది. సంక్రాంతి సీజన్‌లో దక్షిణ మధ్య రైల్వే జోన్ 188 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే సుమారు 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వీటితో పాటు దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా మరో 178 ప్రత్యేక రైళ్లు వెళతాయి. వీటితో పాటు రెగ్యులర్‌గా నడిచే సర్వీసులు యథావిధిగా ప్రయాణికులను చేరవేస్తుంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక సర్వీసులు : భారీ సంఖ్యలో ప్రయాణికులు సొంతూళ్లకు తరలివెళ్లడంతో తిరిగి వచ్చేందుకు సైతం ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇవాళ్టి నుంచే రిటర్న్ రైళ్లను అందుబాటులో ఉంచామని ఈ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు చెప్పారు. దైవ దర్శనాలకు వెళ్లే వారు సైతం ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లతో పాటు, సాధారణ రైళ్లకు అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సులు : పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులను నడిపించింది. తిరిగి వచ్చే ప్రయాణికులతో మహబూబ్​నగర్, కరీంనగర్, వరంగల్, మెదక్ తదితర ప్రాంతాల నుంచి రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నెల 17, 18, 19, 20వ తేదీల్లో రద్దీ ఉంటుందని అధికారులు అనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనపు సర్వీసులను కూడా అందుబాటులో ఉంచామని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు రిజర్వేషన్‌లు ఈ నెల 17వ తేదీ నుంచి మొదలైనట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతామని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు.

కనుమ రోజు తెల్ల చీరకట్టుకొని - వితంతువులుగా మారిపోయి

నగర వాసులను ఆకట్టుకుంటున్న కైట్‌, స్వీట్‌ ఫెస్టివల్‌ - నేడే చివరి రోజు

Last Updated : Jan 15, 2025, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.