తెలంగాణ

telangana

ETV Bharat / videos

బాలయ్య క్రేజ్​ అలాంటిది మరి - ముంబయిలో ప్రతి ఈవెంట్​లోనూ ఆయన సాంగ్సే! - Balakrishna Craze In Mumbai - BALAKRISHNA CRAZE IN MUMBAI

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 5:39 PM IST

Balakrishna Craze In Mumbai : నందమూరి నటసింహం బాలకృష్ణకు సౌత్​లోనే కాదు నార్త్​లోనూ బాగా క్రేజ్​ ఉంది. ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్​ సీన్స్​కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల్లోని బెస్ట్ సీన్స్​ను ట్రెండ్ చేసి రిపీట్ మోడ్​లో చూసేవాళ్లూ ఉన్నారు. అయితే బాలయ్య నార్త్ ఫాలోయింగ్​ గురించి మా అధ్యక్షుడు  మంచు విష్ణు మాట్లాడిన వీడియో తాజాగా నెట్టింట ట్రెండ్ అవుతోంది.  

" ఇక్కడే కాదు ముంబయిలో కూడా ఏదైనా ఈవెనింగ్​, లేదా మ్యూజిక్ పార్టీస్​కు లేకుంటే పబ్స్​కు వెళ్తే దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ గారిదే. అది కూడా జై బాలయ్యతో ఎండ్ అవుతుంది." అంటు బాలయ్య క్రేజ్ గురించి చెప్పుకొచ్చారు.

తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకల కోసం ఏర్పాటు చేసిన  ఓ ప్రెస్ మీట్​లో ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇది విన్న ఫ్యాన్స్ 'జై బాలయ్య' అంటూ ఈ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇదే వేదికగా ఆయన మరిన్ని విషయాలు తెలిపారు. వాళ్లు చేసే వేడుకల ద్వారా ఫండ్‌ రైజ్‌ చేయనున్నట్లు తెలిపారు. వాటిని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 'మా' సభ్యుల బాగోగుల కోసం ఉపయోగించనున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details