తెలంగాణ

telangana

ETV Bharat / videos

అనంత్- రాధిక సంగీత్​ : సినీ, క్రికెటర్ల సందడి మధ్య అంబానీ స్పెషల్ సాంగ్ - Anant Radhika Pre Wedding Ceremony - ANANT RADHIKA PRE WEDDING CEREMONY

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 4:47 PM IST

Anant Radhika Pre Wedding Ceremony : రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ వివాహ  వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో సంగీత్‌ వేడుకులను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సినీ తారలతో పాటు పలువురు టీమ్ఇండియా క్రికెటర్లు పాల్గొని సందడి చేశారు. దీంతో ఆ వేదిక అతిరథ మహారథులతో సందడిగా మారింది.  

ఇక ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలతో పాటు ముకేశ్​ అంబానీ కుటుంబమంతా బాలీవుడ్​ పాపులర్ సాంగ్స్​కు స్టెప్పులేశారు. రణ్​వీర్ సింగ్​, ఆలియా రణ్​బీర్​ జంట, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ ఈ వేడుకలో స్పెషల్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. 

ఇదిలా ఉండగా, అలనాటి ఓ హిందీ పాటను రీక్రియేట్ చేస్తూ ముకేశ్​ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ తన మనవళ్లు, మనవరాళ్లుతో కలిసి చేసిన ఓ వీడియో సంగీత్‌లో టెలికాస్ట్ చేశారు. ఇది ఆ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ABOUT THE AUTHOR

...view details