తెలంగాణ

telangana

ETV Bharat / technology

పండగ వేళ జొమాటో కస్టమర్లకు షాక్- ప్లాట్​ఫామ్​ ఫీజు భారీగా పెంపు..!

ప్లాట్​ఫామ్ ఫీజు పెంచిన జొమాటో- ఇకపై ఫుడ్​ డెలివరీపై వడ్డింపులే!!!

Zomato Hikes Platform Fee on Food Delivery
Zomato Hikes Platform Fee on Food Delivery (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2024, 4:26 PM IST

Zomato Hikes Platform Fee on Food Delivery:దీపావళి పండగ వేళ ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్​ డెలివరీపై ప్లాట్​ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతి ఆర్డర్​పై రూ.10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూ.7 ఉండగా ఇప్పుడు దాన్ని పది రూపాయలకు పెంచింది. ఈ మేరకు పండగ రద్దీ సమయంలో సర్వీసులను విజయవంతగా కొనసాగించేందుకు ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచినట్లు కంపెనీ తన యాప్ ద్వారా తెలియజేసింది.

ఇదేం మొదటిసారి కాదు:జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచడం ఇదేం మొదటిసారి కాదు. జొమాటో కంపెనీని లాభంలోకి తీసుకొచ్చేందుకు తొలిసారి 2023 ఆగస్టులో ప్లాట్‌ఫామ్​ ఫీజును తీసుకొచ్చింది. మొదటి ఆర్డర్‌కు రూ.2 చొప్పున వసూలు చేసేది. ఆ తర్వాత జొమాటో క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ ఫీజును రూ.10కు తీసుకొచ్చింది.

జొమాటో ప్రతి రోజూ 2- 2.5 మిలియన్ల ఫుడ్​ ఆర్డర్లను డెలివరీ చేస్తుందని అంచనా. ప్రస్తుతం ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంపుతో కంపెనీ భారీగా లాభాలను పొందనుంది. ఈ ప్రకటన నేపథ్యంలో జొమాటో షేర్లు రాణించాయి. మధ్యాహ్నం 11:50 గంటల సమయంలో జొమాటో షేరు 2.09 శాతం పెరిగి రూ.261.75 వద్ద ట్రేడవుతోంది.

ప్లాట్‌ఫామ్ ఫీజు కూడా జీఎస్టీ:ఫుడ్​ డెలివరీ సంస్థలు.. ఇప్పటికే జీఎస్టీ, రెస్టారెంట్ ఛార్జీలు, డెలివరీ ఫీజుతో పాటు ప్లాట్‌ఫామ్ ఫీజుతో అదనంగా నగదు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాట్​ఫామ్​ ఫీజును రూ.10లకు పెంచుతున్నట్లు ప్రకటించడంతో కస్టమర్లు కంగుతింటున్నారు. ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.10 పైన కూడా మనం 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో ఫుడ్ ఆర్డర్‌పై ప్లాట్‌ఫాం ఫీజు రూపంలో రూ.11.80 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జొమాటో ప్రత్యర్థి స్విగ్గీ కూడా తన ప్లాట్‌ఫామ్ ఫీజును తక్కువతోనే ప్రారంభించింది. అయితే ఇప్పుడు దీని ప్లాట్​ఫామ్​ ఫీజును రూ.7కు పెంచింది.

BSNL యూజర్స్​కు ఫ్రీ Wi-Fi కనెక్షన్​- వావ్.. ఆఫర్ అదిరిందిగా..!

పండగ వేళ మార్కెట్లోకి లగ్జరీ కారు- ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..!

ABOUT THE AUTHOR

...view details