Ola Electric Launched Two New Scooter Series: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ తన రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ-వీలర్ శ్రేణులను మంగళవారం మార్కెట్లో విడుదల చేసింది. డెలివరీ ఏజెంట్ల కోసం కంపెనీ ప్రతి లైనప్‌లో రెండు మోడల్స్‌ను చేర్చింది. కంపెనీ ఈ శ్రేణులను 'Ola S1 Z ', 'Ola Gig' పేరుతో తీసుకొచ్చింది. సిటీ రైడింగ్‌కు అనుకూలంగా వీటిని డిజైన్ చేశారు. ఈ స్కూటర్లు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. ఇది ఓలా పవర్‌పాడ్‌ని ఉపయోగించి హోమ్ ఇన్వర్టర్‌గా కూడా పనిచేస్తుంది.
ఈ స్కూటర్ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే వీటి డెలివరీలు మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్ చేశారు. ఈ శ్రేణుల్లోని స్కూటర్లు మార్చుకోగలిగే బ్యాటరీలను కలిగి ఉన్నాయి. ఈ రెండు శ్రేణుల్లో మొత్తం నాలుగు రకాలు ఉన్నాయి. వీటిలో మూడు స్కూటర్లు.. డ్యూయల్ 1.5 kWh బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తున్నాయి. 'Ola Gig' మాత్రం కేవలం ఒకే 1.5 kWh బ్యాటరీతో వస్తుంది.
Ola S1 Z and Ola Gig శ్రేణుల ధరలు:
- 'Ola Gig' ధర: రూ. 39,999 (ఎక్స్-షోరూమ్)
- 'Ola Gig+' ధర: రూ. 49,999 (ఎక్స్-షోరూమ్)
- 'Ola S1 Z' ధర: రూ. 59,999 (ఎక్స్-షోరూమ్)
- 'Ola S1 Z+' ధర: రూ. 64,999 (ఎక్స్-షోరూమ్)
'Ola Gig', 'Ola Gig+' స్పెసిఫికేషన్స్: డెలివరీ ఏజెంట్ల కోసం ఈ ఈవీ స్కూటర్లను తీసుకొచ్చారు. ఇందులో గిగ్ వర్కర్ల తక్కువ దూర ప్రయాణానికి వీలుగా 'Ola Gig'ను రూపొందించారు. ఇది 1.5 kWh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 112 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 25 కి.మీ. ఇది బి2బి కొనుగోళ్లు, రెంటల్ కోసం అందుబాటులో ఉంటుంది.
Say hello to Ola S1 Z & Gig range, starting at just ₹39K!
— Bhavish Aggarwal (@bhash) November 26, 2024
Affordable, accessible, and now with a portable battery pack that doubles up as home inverter using the Ola PowerPod
Reservations open, deliveries Apr’25!🛵⚡🔋
Ola S1 Z: https://t.co/jRj8k4oKvQ
Ola Gig:… pic.twitter.com/TcdfNhSIWy
ఇక 'Ola Gig+'ను దూర ప్రయాణాలను చేసే గిగ్ వర్కర్లకు అనుకూలంగా డిజైన్ చేశారు. ఇది 1.5kWh డ్యూయల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 81 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మొత్తం రెండు బ్యాటరీలతో కలిపి 157 కిలోమీటర్లు వెళ్లొచ్చు. దీన్ని కూడా బి2బి కొనుగోళ్లు, రెంటల్స్ కోసం అందుబాటులోకి తేనున్నారు. అంతేకాకా ఈ ఓలా గిగ్ శ్రేణిలో యాప్-బేస్డ్ యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ రైడర్స్ అన్‌లాక్, రైడ్ చేసేందుకు స్కాన్ చేయొచ్చు.
'Ola S1 Z', 'Ola S1 Z+' స్పెసిఫికేషన్స్: తక్కువ ధరలో వ్యక్తిగత అవసరాల కోసం 'Ola S1 Z' స్కూటర్‌ను రూపొందించారు. ఇది కూడా 1.5kWh చొప్పున డ్యూయల్ బ్యాటరీలతో వస్తోంది. ఇది సింగిల్ బ్యాటరీపై 75 కిలోమీటర్లు, రెండు బ్యాటరీలతో కలిపి 146 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 70 kmph టాప్‌స్పీడ్‌తో ప్రయాణించొచ్చు. ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఫిజికల్ కీ ఉంటుంది.
ఇక వ్యక్తిగత, కమర్షియల్ వినియోగం కోసం ఓలా 'Ola S1 Z+' స్కూటర్‌ను డిజైన్ చేశారు. ఇది కూడా 1.5kWh డ్యూయల్ బ్యాటరీతో వస్తోంది. ఇది ఒక బ్యాటరీతో 4.7 సెకన్లలో 0-40 km/h వేగాన్ని అందుకోగలదు. ఇందులో 14 అంగుళాల టైర్లను అమర్చారు. దీని లోడ్ మోసే సామర్థ్యం గురించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వనప్పటికీ, దీని ముందు, వెనుక భాగంలో లోడ్‌ను మోయడానికి క్యారియర్‌లను ఇన్‌స్టాల్ చేసే ఆప్షన్‌ను ఇచ్చింది. దీని ఐడీసీ రేంజ్ 75 కిలోమీటర్లు. రెండు బ్యాటరీలతో అయితే 146 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ 70 kmph. ఫిజికల్ కీ, ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది.
ఓలా పవర్‌పాడ్: ఓలా ఎలక్ట్రిక్.. గృహావసరాల కోసం పవర్ పాడ్‌ను తీసుకొచ్చింది. దీనితో ఓలా పోర్టబుల్ బ్యాటరీని ఇన్వెర్టర్‌లా వాడుకోవచ్చు. 1.5kWh బ్యాటరీ సాయంతో 5 LED బల్బులు, 3 సీలింగ్ ఫ్యాన్లు, 1 టీవీ, 1 మొబైల్ ఫోన్, 1 వైఫై రూటర్‌ను 3 గంటల పాటు వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. విద్యుత్ సరఫరా కొరత ఎదుర్కొంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. దీని ధరను రూ.9,999గా ఓలా పేర్కొంది.
ఈ కారే కావాలట.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఆరు లక్షలమంది కొన్న కారు ఇదే!
ఐఫోన్ ధరతో రియల్మీ కొత్త ఫోన్- అబ్బా.. ఏం ఫీచర్లు రా బాబు.. మైండ్ బ్లోయింగ్..!