ETV Bharat / technology

మహింద్రా ఈవీ కార్లు చూశారా?- సింగిల్ ఛార్జ్‌తో 500 కి.మీ రేంజ్.. ఇక పెట్రోల్, డీజిల్ టెన్షన్​కు గుడ్​బై! - MAHINDRA EV CARS LAUNCHED

మహింద్రా నుంచి రెండు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు- ధర, ఫీచర్లు ఇవే..!

Mahindra XEV 9e and Mahindra BE 6e
Mahindra XEV 9e and Mahindra BE 6e (Mahindra & Mahindra)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 27, 2024, 5:51 PM IST

Updated : Nov 27, 2024, 5:58 PM IST

Mahindra EV Cars Launched: వాహన ప్రియులకు గుడ్​న్యూస్. మార్కెట్లోకి రెండు ఎలక్ట్రిక్ కార్లు ఎంట్రీ ఇచ్చాయి. దేశీయ కార్ల తయారీ సంస్థ మహింద్రా అండ్ మహింద్రా తన రెండు కొత్త ఈవీలను లాంఛ్ చేసింది. 'మహింద్రా XEV 9e', 'మహింద్రా BE 6e' పేరుతో వీటిని తీసుకొచ్చింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

'మహింద్రా XEV 9e' డిజైన్: ఇందులో కొత్త XEV 9e ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో ట్రైయాంగిల్ హెడ్​లైట్లు, ఇన్‌వర్టెడ్ L-షేప్ LED DRLs, ముందు వైపున LED లైట్ బార్, కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, బ్లాంక్డ్​-ఆఫ్ గ్రిల్, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్​తో పాటు కాంట్రాస్ట్ కలర్ ORVMలు ఉన్నాయి. వీటితో పాటు ఇది రీఫ్రెష్డ్ LED టెయిల్‌లైట్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, C-పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్, కనెక్డెడ్ టెయిల్​లైట్​ సెటప్, ఏరో ఇన్సర్ట్​లతో కొత్త అల్లాయ్ వీల్స్​ను కలిగి ఉంది.

'మహింద్రా XEV 9e' ఇంటీరియర్: కారు లోపలి భాగంలో కొత్త టూ-స్పోక్ మల్టీఫంక్షన్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ADAS సూట్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యాష్‌బోర్డ్‌లో థ్రీ-స్క్రీన్ సెటప్, ట్వీక్డ్ సెంటర్ కన్సోల్, కొత్త గేర్ లివర్ అండ్ రోటరీ డయల్ వంటివి ఉన్నాయి.

అంతేకాక ఈ కారులో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (EPB), 1400-వాట్ హర్మాన్-కార్డన్-సోర్స్డ్ 16-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఆటో పార్క్ ఫంక్షన్, వైర్‌లెస్ మొబైల్ ప్రొజెక్షన్, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 65W USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, షెడ్యూల్డ్ ఛార్జింగ్​తో పాటు ఫంక్షన్ అండ్ క్యాబిన్ ప్రీ-కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది.

'మహింద్రా XEV 9e' పవర్​ట్రెయిన్: ఈ కారు 59kWh బ్యాటరీ ప్యాక్​తో వస్తుంది. ఇది ఎలక్ట్రిక్ మోటారుతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది 228bhp పవర్, 380Nm టార్క్‌ను అందిస్తుంది. ఫుల్ ఛార్జింగ్ పై 656 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 140kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా దీని బ్యాటరీని కేవలం 20 నిమిషాల్లో 20-80 శాతం ఛార్జ్ చేయొచ్చు. ఈ కారు 6.8 సెకన్లలో 0-100 kmph స్పీడ్​ను అందుకుంటుంది.

'మహింద్రా BE 6e' డిజైన్: 'మహింద్రా BE 6e' గురించి చెప్పాలంటే వాస్తవానికి దీన్ని 'BE 05' అని పిలుస్తారు. ఇది ఒక కూపే SUV. ఇది ఆభరణాల వంటి హెడ్‌లైట్లు, వెనుక LED లైట్ బార్, టాప్-స్పెక్ వేరియంట్ కోసం 20-అంగుళాల వీల్స్ వంటి స్టైలింగ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంది. ఈ కారు 'XEV 9e' కంటే కొంచెం చిన్న బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఇది 455 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఇందులో 45 లీటర్ల ఫ్రంక్​ను కలిగి ఉంది. ఇక దీని సైజు విషయానికొస్తే.. ఇది 4,371 mm పొడవు, 207 mm గ్రౌండ్ క్లియరెన్స్, 218 mm గ్రౌండ్ క్లియరెన్స్​తో వస్తుంది.

'మహింద్రా BE 6e' ఇంటీరియర్: దీని క్యాబిన్​ను డ్రైవర్-సెంట్రిక్, ఫైటర్ జెట్​ల వంటి థ్రస్టర్​ల ప్రేరణతో తీసుకొచ్చారు. 'XEV 9e' మాదిరిగానే ఇది కూడా ఫీచర్-ఫ్యాక్డ్ మోడల్. ఇందులో మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్​, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, హై-ఎండ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (మహింద్రా సోనిక్ స్టూడియో), పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇంటర్‌ఫేస్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే ఇది దాదాపు మూడు కిలోమీటర్ల పొడవైన వైరింగ్ హార్నెస్​ను కలిగి ఉంది. అంతేకాక 2,000 కంటే ఎక్కువ సర్క్యూట్స్, 36 ECUలు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో ఏడు ఎయిర్ బ్యాగ్స్, ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరాతో పాటు పలు సేఫ్టీ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

'మహింద్రా BE 6e' పవర్‌ట్రెయిన్: ఈ రెండు కార్ల పవర్​ట్రెయిన్​ను కంపెనీ INGLO ప్లాట్‌ఫారమ్‌పై బిల్డ్ చేశారు. దీంతో ఈ కార్లు 59kWh, 79kWhలకు సపోర్ట్​తో వస్తున్నాయి. 'BE 6e' రెండు బ్యాటరీల ఆప్షన్స్​తో తీసుకొచ్చారు. దీని గరిష్ట పరిధి 682 కి.మీ. ఇది ఒక పెర్ఫార్మెన్స్ కారు. దీని మోటార్ 288bhp పవర్, 380nm టార్క్​ను జనరేట్ చేస్తుంది. దీని బ్యాటరీ 175kWh DC ఫాస్ట్ ఛార్జర్‌తో 20 నిమిషాల్లో 20-80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. పెద్ద బ్యాటరీతో 500 కి.మీ వరకు రేంజ్ అందిస్తాయని అంచనా.

ధర: కంపెనీ 'XEV 9e' ని రూ. 21.9 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో రిలీజ్ చేసింది. ఇక మార్కెట్లో 'BE 6e' రూ. 18.9 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంటుంది.

ఓలా నుంచి నాలుగు కొత్త ఈవీ స్కూటర్లు- కేవలం రూ.39వేలకే..!

ఈ కారే కావాలట.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్.. ఆరు లక్షలమంది కొన్న కారు ఇదే!

Last Updated : Nov 27, 2024, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.