ETV Bharat / technology

బిగ్ బ్యాటరీతో రియల్​మీ నయా ఫోన్- కిందపడినా కూడా ఏం కాదంట..! - REALME C75

'రియల్​మీ C75' మొబైల్ లాంఛ్- ధర, ఫీచర్లు ఇవే..!

Realme C75 4G Smartphone
Realme C75 4G Smartphone (Realme)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 27, 2024, 8:00 PM IST

Realme C75: రియల్​మీ తన కొత్త 'C75' స్మార్ట్‌ఫోన్​ను లాంఛ్ చేసింది. కంపెనీ ఈ మొబైల్​ను వియత్నాంలో రెండు కలర్ ఆప్షన్స్​లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 6.72-అంగుళాల IPS LCDని కలిగి ఉంది. ఇది మీడియాటెక్ Helio G92 Max ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్​మీ త్వరలో దీన్ని గ్లోబల్ మార్కెట్లో రిలీజ్​ చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రియల్​మీ C75 మొబైల్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

రియల్​మీ C75 ఫీచర్లు: ఈ కొత్త 'రియల్​మీ C75' మొబైల్​లో 6.72-అంగుళాల IPS LCDని అమర్చారు. ఇది పూర్తి HD ప్లస్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ Helio G92 Max చిప్‌సెట్​ను అమర్చారు. ఈ ఫోన్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మంచి లుక్​లో కన్పిస్తుంది. ఇది ఆర్మర్‌షెల్ టెంపర్డ్ గ్లాస్ స్క్రీన్‌తో ఇంపాక్ట్-అబ్సోర్బింగ్ డిజైన్‌ను కలిగి ఉంది. దీంతో ఇది కిందపడినా అంత సులభంగా దీనికి ఏం కాదని, ఈ ఫోన్ డ్రాప్‌లను తట్టుకోగలదని రియల్‌మీ తెలిపింది. వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్​తో ఈ ఫోన్ ఫోన్ IP69 రేటింగ్‌తో వస్తుంది. అంతేకాక దీనిలోని మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ MIL-STD-810H సర్టిఫికేషన్ ఫోన్‌కు అదనపు మన్నికను అందిస్తుంది.

45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్: 'రియల్​మీ C75' మొబైల్ కెమెరా సెటప్​ను పరిశీలిస్తే.. ఇది వెనకవైపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్​మీ UI 5.0 పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాక ఇది రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది పవర్ బ్యాంక్‌గా పని చేస్తుంది. దీంతో మీరు ఈ ఫోన్ నుంచి ఇతర డివైజ్​లను కూడా ఛార్జ్ చేయొచ్చు.

కలర్ ఆప్షన్స్:

  • లైట్నింగ్ గోల్డ్
  • బ్లాక్ స్టార్మ్ నైట్

ధర:

  • 8GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ ధర: VND 6,490,000 (దాదాపు రూ. 21,600)
  • 8GB RAM + 512GB వెర్షన్ ధర: VND 7,490,000 (దాదాపు రూ. 24,900)

వన్​ప్లస్​ నుంచి కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్- వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

మహింద్రా ఈవీ కార్లు చూశారా?- సింగిల్ ఛార్జ్‌తో 500 కి.మీ రేంజ్.. ఇక పెట్రోల్, డీజిల్ టెన్షన్​కు గుడ్​బై!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.