Few Techniques to Improve Study Skills : ఎంత చదివినా చదివింది గుర్తుండట్లేదా ? ఎన్ని పరీక్షలు రాసినా మంచి స్కోరు రావడం లేదా ? ఎలా చదవాలో ఏ పద్ధతిలో చదవాలని తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారా ? అయితే కింద ఉన్న ఈ టెక్నిక్లను అలవాటు చేసుకుని మీ అధ్యయన పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే. ఈ టెక్నిక్స్‌తో మీ గ్రేడ్‌లను మెరుగుపరుచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ స్టడీ స్కిల్స్ పెంచుకోవడంతో ఉపయోగపడే ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందామా.
- మైండ్ మ్యాపింగ్ : స్టడీ స్కిల్స్‌ను మెరుగుపరచడంలో మైండ్ మ్యాపింగ్ అనేది గొప్ప సాధన. పుస్తకంలోని కాన్సెప్ట్‌లను, మీ ఆలోచనలను అనుసంధానం చేసే విజువల్ రేఖాచిత్రాల రూపకల్పనే మైండ్ మ్యాపింగ్ పద్ధతి. దీన్ని అలవాటు చేసుకుంటే పాఠ్యాంశాల మధ్య సంబంధాలను ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ కాలం కూడా గుర్తుండేలా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
2. రంగుల కోడ్ నోట్స్ : నోట్స్ రాసే సమయంలో వివిధ కలర్స్ ఉపయోగించడం ద్వారా విజువల్ లెర్నర్స్ సమాచారాన్ని గుర్తించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన టాపిక్‌ను కలర్ కోడింగ్ చేయడంతోపాటు అధ్యయనాన్ని ఆకర్షణీయంగా చేస్తుంది.
3. గ్రూప్ స్టడీ సెషన్‌లూ : ఎప్పుడు ఒంటరిగా కాకుండా తోటి విద్యార్థులతో గ్రూప్‌గా ఒకరికొకరు సహకరించుకుంటూ, అర్థం కాని టాపిక్‌లను షేర్ చేసుకోవడం వల్ల సులభంగా నేర్చుకోగలుగుతారు. ఈ అలవాటును పెంపొదించుకుంటే అధ్యయన ప్రక్రియలోను గణనీయమైన పురోగతి కనబడే అవకాశం ఉంది.
4. ఎడ్యుకేషనల్ వీడియోలు, చదువుకు సంబంధించిన డాక్యుమెంటరీలను చూడటం వల్ల వివిధ అంశాలపై కొంత మేరకు అవగాహన పెరుగుతుంది. కొత్త కాన్సెప్టులు సైతం తెలుస్తాయి. ఆయా సబ్జెక్టులపై స్పష్టమైన అవగాహన కూడా పెరుగుతుంది.
5. ఫెయిన్మన్ లెర్నింగ్ టెక్నిక్ లెర్నింగ్ ప్రక్రియకు ఒక రీఛార్జిలా ఉంటుంది. మీరు నేర్చుకున్న విషయాన్ని సాధారణ పదాల్లో మరొకరికి అర్థమయ్యేలా సరళంగా చెప్పే నైపుణ్యాన్ని సాధించడమే ఫెయిన్మన్ టెక్నిక్ అని అంటారు. ఈ టెక్నిక్‌ను అలవాటు చేసుకుంటే మీ అవగాహనలో లోపాలను గుర్తించడంతోపాటు జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అందుకోసం మీరు చదవాలనుకున్న అంశాన్ని ఒక పేపర్‌పై మీకు తెలిసినవి అందరికీ అర్థమయ్యేంత సరళంగా రాసుకోవాలి. ఇలా రాసే సమయంలో వచ్చే సందేహాలను అదే పేపర్లో వేరే పెన్‌తో రాయాలి. దీని వల్ల మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవడమే కాకుండా మీ జ్ఞాన సంపద కూడా పెంచుకోవచ్చు.
6. సరదాగా ఎడ్యుకేషనల్ బోర్డ్ గేమ్‌లు ఆడే అలవాటు చేసుకుంటే అవే మీ థింకింగ్ కెపాసిటీని పెంచుతాయి. కాన్సెప్ట్‌లను సైతం అర్థం చేసుకోవడంలో దోహదపడతాయి. దీంతో క్రిటికల్ థింకింగ్‌తోపాటు లెర్నింగ్‌ను ఆస్వాదించే నైపుణ్యాన్ని అలవరుస్తుంది.
7. నోట్-టేకింగ్ : ముఖ్యమైన సమాచారాన్ని మాత్రమే గ్రహించి మీ అవసరానికి అనుగుణంగా ఆర్గనైజ్ చేసుకొనేందుకు ఈ నోట్ టేకింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల ఏ సబ్జెక్టు అయినా బాగా అర్థం చేసుకుంటాం. అంతేకాకుండా ఈ టెక్నిక్ రీకాల్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఇలా చదివితే ఉద్యోగం గ్యారెంటీ! - Smart Study Tips