OnePlus Ace 5 Series: వన్‌ప్లస్ త్వరలో చైనాలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ 'Ace 5' సిరీస్‌ని విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో 'వన్‌ప్లస్ ఏస్ 5', 'వన్‌ప్లస్ ఏస్ 5 ప్రో' అనే రెండు మోడల్ మొబైల్స్ ఉన్నాయి. 'వన్‌ప్లస్ ఏస్ 3' సిరీస్ తర్వాత కంపెనీ నేరుగా 'ఏస్ 5'ను తీసుకొస్తుంది. దీని ప్రీవియస్ వెర్షన్ కంటే ఈ కొత్త మోడల్లో చాలా అప్‌గ్రేడ్స్ చూస్తారు. 'వన్‌ప్లస్ 13R' పేరుతో ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రానుంది. 'వన్‌ప్లస్ ఏస్ 5' స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ సిరీస్‌ను డిసెంబర్ 2024లో రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ మొదటి రెండు వారాల్లో ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ దీని ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది.
'వన్‌ప్లస్ ఏస్ 5' సిరీస్ అంచనా ఫీచర్లు: ఈ సిరీస్‌లో 'వన్‌ప్లస్ ఏస్ 5' మోడల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoCతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక 'ఏస్ 5 ప్రో' స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో ప్రారంభించొచ్చు. అయితే వీటిలో 'ఏస్ 5 ప్రో' మోడల్ మొబైల్ ఇండియన్ మార్కెట్లోకి రాదు. కానీ 'వన్‌ప్లస్ ఏస్ 5' మొబైల్‌ను 'వన్‌ప్లస్ 13R' గా రీబ్రాండ్ చేసి భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
OnePlus Ace 5 retail boxes pic.twitter.com/dQwRkYKbjj
— OnePlus Club (@OnePlusClub) November 27, 2024
1.5K రిజల్యూషన్ ఫ్లాట్ డిస్‌ప్లే: 'వన్‌ప్లస్ ఏస్ 5' ఫోన్ 1.5K రిజల్యూషన్ ఫ్లాట్ డిస్‌ప్లే, ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 6000 లేదా 6500mAh బ్యాటరీతో 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. 'ఏస్ 5' లేదా 'వన్‌ప్లస్ 13R'లో 'వన్‌ప్లస్ 13' మాదిరిగా Hasselblad-tuned కెమెరా ఉండదు. దీంతోపాటు ఇందులో టెలిఫోటో సెన్సార్ కూడా ఉండదు. ఇది 'వన్‌ప్లస్ 13' స్మార్ట్‌ఫోన్‌లో కూడా లేదు.
అంచనా ధర: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3తో వస్తున్న 'వన్‌ప్లస్ ఏస్ 5' అనేది పవర్‌హౌస్ ఫోన్. ఈ ఫోన్ ఇండియాలో లాంఛ్ అయినట్లయితే దీని ధర రూ.50 వేల లోపే ఉంటుంది. ఇది వినియోగదారలకు గ్రేట్ డీల్. అయితే దీని కంటే 'వన్‌ప్లస్ ఏస్ 5 ప్రో' మరింత ప్రత్యేకమైన, మెరుగైన ఫీచర్లతో వస్తుంది. కానీ ఈ ఫోన్ చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. గ్లోబల్ మార్కెట్‌లో మరెక్కడా కంపెనీ దీన్ని రిలీజ్ చేయట్లేదు.