Year Ender 2024 Top Flagship Smartphones:ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల ట్రెండ్ నడుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్‌ను వినియోగిస్తున్నారు. అందులో యువత అయితే ధర ఎక్కువగా ఉన్నా పర్లేదని ప్రీమియం ఫోన్ల వైపే మొగ్గు చూపిస్తోంది. దీంతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దాదాపు అన్ని బ్రాండ్ల నుంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేశాయి.
సాధారణంగా ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్లో యాపిల్, శాంసంగ్ కంపెనీలదే హవా. అయితే గత కొన్నేళ్ల నుంచి మోటొరోలా, వీవో వంటి ఇతర బ్రాండ్లు కూడా అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన టాప్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి.
1. Samsung Galaxy S24 Ultra:ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది జనవరి 17న లాంఛ్ అయింది. ఈ మొబైల్లో లైవ్ ట్రాన్స్‌లేట్, సర్కిల్ టు సెర్చ్ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి. ఇందులో క్వాల్కామ్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇతర చిప్సెట్లతో పోలిస్తే ఇది బ్యాటరీ లైఫ్, పనితీరులో అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అంతేకాక కంపెనీ ఈ మొబైల్‌ను ఏడు సంవత్సరాల మేజర్ OS అప్‌గ్రేడ్స్‌తో పాటు సెక్యూరిటీ ప్యాచెస్‌తో అందిస్తోంది.
ఫీచర్లు:
- డిస్‌ప్లే:6.8 అంగుళాల ఫుల్ రెక్టాంగిల్
- రిజల్యూషన్:3120 x 1440 (Quad HD+)
- ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ఫ్లాగ్‌షిప్
- పీక్ బ్రైట్నెస్: 2,600నిట్స్
- రిఫ్రెష్ రేట్: 120HZ
- కెమెరా సెటప్:200.0 MP + 50.0 MP + 12.0 MP + 10.0 MP
- ర్యామ్:12GB
- స్టోరీజీ:512GB
- అవైలబుల్ స్టోరీజ్: 484.0GB
- ధర:రూ. 1,21,999
2. Samsung Galaxy Z Fold 6:శాంసంగ్ కంపెనీ ఈ 'గెలాక్సీ Z ఫోల్డ్ 6' స్మార్ట్‌ఫోన్‌ను 2024, జూలై 24వ తేదీన రిలీజ్ చేసింది. ఇది IP48 వాటర్ అండ్ డస్ట్-రెసిస్టెంట్ రేటింగ్‌ను కలిగి ఉన్న మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ సన్నగా లైట్ వెయిట్‌తో ఉంటుంది. ఇక ఇందులో కూడా లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది కూడా అత్యుత్తమ బ్యాటరీ లైఫ్, పెర్ఫార్మెన్స్ను అందిస్తుంది. మార్కెట్లో ఈ ఫోన్ కూడా అదిరే AI ఫీచర్లతో అందుబాటులో ఉంది.
ఫీచర్లు:
- కవర్ డిస్‌ప్లే:6.3 అంగుళాల HD+ డైనమిక్ AMOLED 2X, 2376 x 968 పిక్సెల్స్, 120Hz
- మెయిన్ డిస్‌ప్లే: 7.6-inch QXGA+ డైనమిక్ AMOLED 2X ఫ్లెక్సిబుల్, 2160 x 1856 పిక్సెల్స్, 120Hz
దీని లార్జ్ స్క్రీన్‌ను సెకండరీ డిస్‌ప్లేగా ఉపయోగించుకోవచ్చు. ఇది ఫిల్మింగ్కి బాగా ఉపయోగపడుతుందని సమాచారం.
- ప్రాసెసర్:లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ఫ్లాగ్‌షిప్
- బరువు:239g
- మందం:5.6 mm
- 12GB ర్యామ్
- 256GB నుంచి 1TB వరకు స్టోరేజీ ఆప్షన్స్
- రియర్ కెమెరా:50MP ప్రైమరీ సెన్సర్ విత్ OIS, 10MP టెలిఫొటో లెన్స్ విత్ 3x ఆప్టికల్ జూమ్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్
- ఫ్రంట్ కెమెరాలు:10MP కవర్ కెమెరా, 4MP అండర్-డిస్‌ప్లే కెమెరా
- ధర:రూ. 1,44,999
ఈ సిరీస్‌లోని సిగ్నేచర్ ఫీచర్.. మొబైల్‌ను విప్పినప్పుడు లార్జ్ టాబ్లెట్ వంటి ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇక మొబైల్‌ను మూసివేసేటప్పుడు కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ఫారమ్ ఫ్యాక్టర్ వంటి అనుభవాన్ని ఇస్తుంది.
3. Xiaomi 14 Ultra:ఈ మచ్ అప్డేటెడ్ స్మార్ట్‌ఫోన్‌ను 2024 ఫిబ్రవరి 22న లాంఛ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త అల్యూమినియం బిల్డ్‌తో వచ్చింది. డ్యూరెబులిటీ కోసం ఈ ఫోన్‌కు షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. ఈ ఫోన్లో 'ఏఐ ఫేస్ అన్‌లాక్' ఫీచర్ ఉంది.
ఫీచర్లు:
- డిస్‌ప్లే:6.73 అంగుళాల ఓఎఈడీ ఎల్‌టీపీఓ స్క్రీన్
- రిజల్యూషన్:3200x1440 పిక్సెల్స్
- బ్యాటరీ: 5300mAh
- రిఫ్రెష్‌రేట్:120HZ
- ప్రాసెసర్:లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ఫ్లాగ్‌షిప్
- పీక్ బ్రైట్నెస్:3000 నిట్స్
- 16GB RAM
- 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్
- 90W ఫాస్ట్ ఛార్జింగ్
- వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్
- 512GB ఇన్‌బిల్డ్ స్టోరేజ్
- కెమెరా సెటప్:ఈ స్మార్ట్ఫోన్లోక్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. కంపెనీ దీని కెమెరాపై ఎక్కువ ఫోకస్ చేసినట్లు కన్పిస్తోంది. ప్రైమరీ కెమెరాలో 50 మెగాపిక్సెల్ లెన్స్, 1 ఇంచ్ టైప్ సోనీ ఎల్వైటి -900 సెన్సార్ ఉన్నాయి. ఇది అత్యున్నత ఇమేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. టెలిఫోటో లెన్స్‌లో 3.2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ సెన్సార్లు, పెరిస్కోప్ లెన్స్‌లో 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, అల్ట్రావైడ్ లెన్స్‌లో 122 డిగ్రీల వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ వంటివి ఉన్నాయి.
- ధర: రూ. 99,998
4. Realme GT 7 Pro:ఈ మొబైల్ దేశంలోనే సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది క్వాల్కామ్ అడ్వాన్స్డ్ 3nm TSMC ప్రాసెస్‌ను ఉపయోగించిన మొదటిది. ఈ చిప్సెట్తో వచ్చిన తొలి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ తమదేనని కంపెనీ చెబుతోంది. అంతేకాక ఈ మొబైల్ ఆకట్టుకునే 2+6 ఓరియన్ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. గేమింగ్ లవర్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ స్కెచ్, సమ్మరీ, స్పీక్, రైటర్, బెస్ట్ ఫేస్ వంటి ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.
రియల్మీ GT 7 ప్రో స్పెసిఫికేషన్స్:
- డిస్‌ప్లే:6.78 అంగుళాల క్వాడ్ కర్వ్‌డ్ అమోలెడ్
- ప్రాసెసర్:స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్
- రిఫ్రెష్‌రేటు:120Hz
- బ్రైట్నెస్: 6500 నిట్స్
- బ్యాటరీ: 5,800 ఎంఏహెచ్
- 120W ఫాస్ట్ ఛార్జింగ్
- మెయిన్ కెమెరా: 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా: 16 ఎంపీ
- టెలిఫొటో లెన్స్:50 ఎంపీ
- అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా:8 ఎంపీ
కలర్ ఆప్షన్స్:
- మార్స్ ఆరెంజ్
- గెలాక్సీ గ్రే
వేరియంట్స్:ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది.
- 12GB+ 256GB వేరియంట్
- 16GB+ 512GB వేరియంట్
ధర:
- 12GB+ 256GB వేరియంట్ ధర: రూ.59,999
- 16GB+ 512GB వేరియంట్ ధర: రూ.65,999
5. iQOO 13:కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 3వ తేదీన లాంఛ్ చేసింది. ఈ ఫోన్ 'మాన్స్టర్ హాలో' లైట్ ఎఫెక్ట్‌ను కలిగి ఉంది. ఈ డిజైన్ కెమెరా మాడ్యూల్ చుట్టూ ఉంది. ఇది మొబైల్లో కాల్, మెసేజ్ లేదా ఛార్జింగ్ వంటి నోటిఫికేషన్స్ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. దీనిలో గేమింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పాటు Q2 సూపర్ కంప్యూటింగ్‌ను అందించారు. ఇది 2K గేమ్ సూపర్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇది గ్రాఫిక్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఫోన్ వేడెక్కకుండా కాపాడుతుంది.
- డిస్‌ప్లే: 6.82-అంగుళాల LTPO AMOLED ఫ్లాట్ స్క్రీన్
- రిజల్యూషన్:2K
- రిఫ్రెష్ రేట్: 144Hz
- ప్రాసెసర్:క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్
- వెనక కెమెరా: 50MP ప్రైమరీ (Sony IMX921) + 50MP అల్ట్రా-వైడ్ + 50MP టెలిఫోటో
- ఫ్రంట్ కెమెరా: 32MP
- బ్యాటరీ: 6,000mAh
- ఛార్జింగ్:120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- ఆపరేటింగ్ సిస్టమ్:ఆండ్రాయిడ్ 15 బేస్డ్ FunTouchOS 15
- అప్డేట్స్:4 ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్
- ప్రొటెక్షన్: IP68/IP69
- వాటర్, డస్ట్ రెసిస్టెన్సీతో ఈ ఫోన్IP68, IP69 రేటింగ్స్ కలిగి ఉందని కంపెనీ చెబుతోంది.
కలర్ ఆప్షన్స్:
- నార్డో గ్రే (ఇటాలియన్ రేసింగ్ కారు డిజైన్ బేస్డ్)
- లెజెండ్ ఎడిషన్ (BMW మోటార్‌స్పోర్ట్ లాంటి మూడు రంగుల చారలతో)
- ధర:రూ. 54,999
6. iphone 16 Pro Max:ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను ఇటీవల సెప్టెంబర్ 20వ తేదీన కాలిఫోర్నియాలో జరిగిన గ్లోటైమ్ ఈవెంట్లో లాంఛ్ చేసింది. ఈ సిరీస్‌లో 'ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్' ఫోన్ను కూడా తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ 9, శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో అందుబాటులోకి వచ్చిన ఏఐ తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఇందులో అందించింది. చాలావరకు ఏఐ టాస్క్‌లు రిమోట్ డేటా సెంటర్లకు బదులుగా ఈ కొత్త ఐఫోన్లోనే పూర్తవుతాయి. ఇది ఐఓఎస్18తో పనిచేస్తుంది.
స్పెసిఫికేషన్లు:
- కెపాసిటీ: 128, 256, 512 GB, 1 TB
- డిస్‌ప్లే:6.9 అంగుళాలు
- మెయిన్ కెమెరా: 48 మెగా పిక్సెల్
- ఫ్రంట్ కెమెరా: 12 మెగా పిక్సెల్
- ఛార్జర్:సీటైప్