Samsung Galaxy S25 Series: శాంసంగ్ మరికొన్ని రోజుల్లో తన నెక్స్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S25 పేరుతో ఎంట్రీ ఇవ్వబోతోన్న ఈ సిరీస్‌లో కంపెనీ 3 లేదా 4 స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుందని సమాచారం.
ఈ మూడు ఫోన్‌లు శాంసంగ్ గెలాక్సీ S25, శాంసంగ్ గెలాక్సీ S25+, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా. అంతేకాక శాంసంగ్ ఈ సిరీస్‌లో గెలాక్సీ S25 స్లిమ్ మోడల్‌ను కూడా లాంఛ్ చేయొచ్చు. అయితే దీని గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందించలేదు.
ఈ ఫోన్‌లన్నింటినీ లాంఛ్ చేసేందుకు శాంసంగ్ ఓ ఈవెంట్‌ని నిర్వహించబోతోంది. దీన్ని శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ అనే పేరుతో నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రాం జనవరి 22న భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు అమెరికాలో జరగనుంది.
ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంఛ్‌కు ముందుగా అనేక లీక్స్ వెల్లడయ్యాయి. అయితే టిప్‌స్టర్ ఇవాన్ బ్లాష్ సబ్‌స్టాక్ ద్వారా గెలాక్సీ S25 సిరీస్ మొదటి అధికారిక రెండర్‌లను లీక్ చేశారు.
టిప్‌స్టర్ లీక్డ్ రెండర్స్: టిప్‌స్టర్ లీక్ చేసిన ఇమేజ్‌ల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ S25, శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ స్మార్ట్ఫోన్ల డిజైన్ వాటి ప్రీవియస్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఈ రెండు ఫోన్ల వెనక భాగంలో అదే విభిన్నమైన కెమెరా రింగ్‌లతో కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. అదే సమయంలో గతేడాది ప్రారంభించిన గెలాక్సీ S సిరీస్‌లోని ఈ రెండు మోడళ్లలో కనిపించినట్లుగా, వీటి ముందు భాగంలో ఫ్రంట్ కెమెరా కోసం అదే హోల్-పంచ్ కటౌట్ ఉండొచ్చు.
అయితే గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా డిజైన్ రౌండ్ కార్నర్స్‌తో రావొచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది జరిగితే ఈ సంవత్సరం శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ అల్ట్రా మోడల్ డిజైన్ మారడాన్ని చూడొచ్చు.
ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ నివేదిక ప్రకారం శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్‌లో క్వాల్కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC చిప్‌సెట్ ఉండొచ్చు. ఇది 12GB RAM స్టార్టింగ్ వేరియంట్‌తో రావచ్చు. ఈ సిరీస్‌లోని అన్ని మోడళ్లు డ్యూయల్ సిమ్ సపోర్ట్ (ఇ-సిమ్ సపోర్ట్), వై-ఫై 7, బ్లూటూత్ 5.3, 12MP సెల్ఫీ కెమెరాతో రావచ్చు. ఇది కాకుండా ఈ ఫోన్‌లు ఇటీవలే అక్టోబర్ 2024లో ప్రకటించిన ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OneUI 7పై కూడా రన్ అవుతాయి.
1. గెలాక్సీ S25లో ఊహించిన స్పెసిఫికేషన్లు:
- డిస్ప్లే: 6.2-అంగుళాల (2,340×1,080 పిక్సెల్స్) డైనమిక్ AMOLED 2X స్క్రీన్
- రిఫ్రెష్ రేట్: 120Hz
- బ్యాటరీ: 4000mAh
స్టోరేజ్ ఆప్షన్స్: కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మూడు స్టోరేజ్ ఆప్షన్‌లలో లాంఛ్ చేయొచ్చు.
- 128GB
- 256GB
- 512GB
ఇది 25W వైర్డు అండ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 162 గ్రాముల బరువుతో రావొచ్చు.
- కెమెరా సెటప్: ఈ ఫోన్ వెనక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ఇది మెయిన్ కెమెరా 50MP కావచ్చు. సెకండ్ కెమెరా 12MP వైడ్ యాంగిల్ లెన్స్‌తో రావచ్చు. ఇక ఈ ఫోన్ థర్డ్ కెమెరా 10MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుందని తెలుస్తోంది. దీని టెలిఫోటో లెన్స్ OIS సపోర్ట్, 3x ఆప్టికల్ జూమ్ ఫీచర్లతో రావచ్చు. కంపెనీ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 12MP ఫ్రంట్ కెమెరాను అందించొచ్చు. దీని ఎపర్చరు f/2.2 ఉంటుంది.
2. గెలాక్సీ S25+లో ఊహించిన స్పెసిఫికేషన్లు:
- డిస్ప్లే: 6.67 అంగుళాల (3,120×1,440 పిక్సెల్స్) డైనమిక్ AMOLED 2X స్క్రీన్
- రిఫ్రెష్ రేట్: 120Hz
- బ్యాటరీ: 4900mAh
- ఇది 45W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో రావచ్చు.
- కెమెరా సెటప్: గెలాక్సీ S25+ కూడా లీక్ అయిన సమాచారం ప్రకారం గెలాక్సీ S25 మాదిరి కెమెరా సెటప్‌తోనే వస్తుందని తెలుస్తోంది.
స్టోరేజ్ ఆప్షన్స్: కంపెనీ ఈ ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో మాత్రమే తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
- 256GB
- 512GB
3. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో ఊహించిన స్పెసిఫికేషన్స్:
- డిస్ప్లే: 6.9-అంగుళాల (3,120×1,440 పిక్సెల్స్) డైనమిక్ AMOLED 2X స్క్రీన్
- రిఫ్రెష్ రేట్: 120Hz
- బ్యాటరీ: 5000mAh
- 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
స్టోరేజ్ ఆప్షన్స్: ఈ ఫోన్‌ను మూడు వేరియంట్లలో రిలీజ్ కావచ్చు.
- 256GB
- 512GB
- 1TB
కెమెరా సెటప్: ఈ ఫోన్ వెనక భాగంలో నాలుగు కెమెరాలు అంటే క్వాడ్ కెమెరా సెటప్‌తో రావచ్చు. దీని మెయిన్ కెమెరా 200MP కావచ్చు. సెకండ్ కెమెరా 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో రావచ్చు. థర్డ్ కెమెరా OIS, 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 50MP కావచ్చు. ఇక దీని నాలుగో కెమెరా 10MP టెలిఫోటో లెన్స్‌తో రావచ్చు. ఈ లెన్స్ OIS సపోర్ట్, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో కూడా వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ఐఓఎస్ డివైజ్ యూజర్లకు అదిరే అప్డేట్- గ్రోక్ ఏఐ కోసం అందుబాటులోకి సొంత యాప్!
సరికొత్త టెక్నాలజీతో లగ్జరీ బెంజ్ ఈవీ లాంఛ్- సింగిల్ ఛార్జ్‌తో 470కి.మీ రేంజ్!
వావ్ స్పోర్టివ్ డిజైన్‌లో కొత్త పల్సర్ భలే ఉందిగా!- ఫీచర్స్, పెర్ఫార్మెన్స్లో కూడా సూపరంతే!