ETV Bharat / technology

ఐఓఎస్ డివైజ్​ యూజర్లకు అదిరే అప్​డేట్- గ్రోక్ ఏఐ కోసం అందుబాటులోకి సొంత యాప్! - GROK AI APP LAUNCHED

గ్రోక్ ఏఐ చాట్​బాట్​ కోసం కొత్త యాప్- ఇకపై Xలోకి వెళ్లాల్సిన పనిలేదుగా..!

Grok AI App Launched for iOS Devices
Grok AI App Launched for iOS Devices (Photo Credit- xAI)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 13, 2025, 1:43 PM IST

Grok AI App Launched for iOS Devices in India: ఎలోన్ మస్క్ తన AI ప్లాట్‌ఫామ్ గ్రోక్ కోసం కొత్త యాప్‌ను ప్రారంభించారు. ఇది భారత్​, అమెరికాతో సహా అనేక దేశాలలో ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీన్ని యాపిల్ యాప్ స్టోర్‌ నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు గ్రోక్ AI కోసం ప్రత్యేక యాప్ లేదు. బదులుగా ప్రజలు దానిని ఉపయోగించేందుకు మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ X (పాత పేరు ట్విట్టర్)కి వెళ్లాల్సి వచ్చేది.

గ్రోక్ AI కోసం యాప్ లాంఛ్: లార్జ్ లాంగ్వెజ్ మోడల్స్​ అంటే భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న AI చాట్​బాట్​లు వాటికి సొంత యాప్స్​ను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు ChatGPT, Copilot, Google Gemini మొదలైనవి. ఈ AI ప్లాట్​ఫారమ్​లు iOS, Android ఆపరేటింగ్ సిస్టమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. కానీ ఎలోన్ మస్క్ AI గ్రోక్ మాత్రం​ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో మాత్రమే అందుబాటులో ఉండేది.

ఇప్పుడు iOS వినియోగదారులకు అందుబాటులో ఉన్న Grok AI కోసం ఒక ప్రత్యేక యాప్​ను తీసుకొచ్చారు. యూజర్లు ఈ యాప్‌ను తమ ఐఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇప్పుడు X (ట్విటర్) ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఏదైనా ఇతర AI యాప్ ద్వారా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లో అందుబాటులో లేదు. కానీ త్వరలో ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుందని సమాచారం.

'Grok AI' యాప్ స్పెషల్ ఫీచర్లు:

  • ఐఫోన్ యూజర్లు Grok AI యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
  • ఈ యాప్ ప్రస్తుతం iOS డివైజ్​లకు మాత్రమే అందుబాటులో ఉంది.
  • వినియోగదారులు ఈ యాప్‌ను యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత యూజర్లు వారి ఇమెయిల్ అడ్రస్, యాపిల్ అకౌంట్ లేదా ఏదైనా ఇతర సపోర్టెడ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి ఈ AI యాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.
  • ఏదైనా ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి, ఇమేజ్​లను రూపొందించేందుకు ఈ యాప్​లో అందుకు సంబంధించిన టూల్స్​ కూడా అందుబాటులో ఉంటాయి.
  • ఈ యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంది. సబ్‌స్క్రిప్షన్ చేసుకున్న తర్వాత వినియోగదారులు అధునాతన ఫీచర్‌లను పొందుతారు.

2023లో ప్రారంభించిన Grok AI: చాట్​జీపీటీ, బార్డ్​ ఏఐకి పోటీగా ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ Grok AI చాట్​బాట్​ను నవంబర్​ 2023లో ప్రారంభించారు. ఆ సమయంలో ఇది X (ట్విట్టర్)కి లింక్ అయి అదే ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉండేది. అంతేకకాక మొదట్లో ఈ యాప్​ X పెయిడ్ సబ్​స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.

అయితే డిసెంబర్ 2024 నుంచి దీని ఉచిత వెర్షన్ కూడా తీసుకొచ్చారు. అప్పటి నుంచి వినియోగదారులు ఎలోన్ మస్క్ ఈ AI యాప్‌ను ఫస్ట్ 10 సార్లు ప్రతిరోజూ ఉచితంగా ఉపయోగించుకోగలుగుతున్నారు. అయితే ఈ లిమిట్ దాటిన తర్వాత దాన్ని ఉపయోగించేందుకు పెయిడ్ సబ్​స్క్రిప్షన్​ను తీసుకోవాల్సి ఉంటుంది.

సరికొత్త టెక్నాలజీతో లగ్జరీ బెంజ్ ఈవీ లాంఛ్- సింగిల్ ఛార్జ్​తో 470కి.మీ రేంజ్!

వావ్ స్పోర్టివ్ డిజైన్​లో కొత్త పల్సర్ భలే ఉందిగా!- ఫీచర్స్, పెర్ఫార్మెన్స్​లో కూడా సూపరంతే!

చౌకైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా?- రూ.200లోపు ధరలో బెస్ట్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.