Winter Solstice 2024 Details: సాధారణంగా ఒక రోజు అంటే.. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే.. కొన్ని సార్లు పగలు ఎక్కువగా ఉండటం, రాత్రుళ్లు తక్కువగా ఉండటం.. పగలు తక్కువగా ఉండి, రాత్రుళ్లు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సాధారణంగా ఇలా జరిగే ప్రక్రియను "అయానంతం"(సోల్స్టీస్)అంటారు. తాజాగా అలాంటి రోజు ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీన రాబోతుంది. ఈ రోజున పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సూర్యుడికి సుదూరంగా భూమి:సూర్యుడు మధ్యాహ్న సమయంలో ఆకాశంలో అత్యధిక లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలో ఉండే రెండు బిందువులను అయనాంతం అంటారు. దీని ఫలితంగా సంవత్సరంలో అతి పొడవైన రోజు (వేసవి కాలపు అయనాంతం), అతి తక్కువ రోజు (శీతాకాలపు అయనాంతం) వస్తుంది. ఇది ఏటా రెండుసార్లు జరిగే ఘట్టం.
ఇక పగలు సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉండే పరిస్థితిని శీతాకాలం అయానంతం(వింటర్ సోల్స్టీస్) అంటారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబరు 19 నుంచి 23 మధ్యలో ఏదో ఒక రోజు జరుగుతుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుంచి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ సమయం ఉంటుంది. ఇక ఈ రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024, డిసెంబరు 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువగా పగలు 8 గంటలు, సుదీర్ఘమైన రాత్రిగా చంద్ర కాంతి 16 గంటల వరకు ఉంటుంది.