Samsung Galaxy F06 : ప్రస్తుత రోజుల్లో సెల్‌ఫోన్ అనేది మనిషి జీవితంలో ఒక అత్యవసర వస్తువుగా మారిపోయింది. ఒక్కరోజు చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఆ రోజు జీవితంలో ఏదో కోల్పోయామన్న ఫీలింగ్‌కు వచ్చేస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు నిత్యం ఫోన్‌తోనే గడిపేస్తున్నారు. అలాంటి సెల్‌ఫోన్‌ను వారు వాడినప్పుడు ఏ మోడల్ అయితే ఉందో ఆ తర్వాత కూడా అదే మోడల్ ఉంటే ఎవరికైనా బోర్ కొట్టడం కామన్. అందుకే చాలా మొబైల్ కంపెనీలు వినియోగదారుడి అభిరుచులకు తగ్గట్లుగా నెలకు ఒక న్యూ మోడల్‌ను లాంచ్ చేస్తున్నాయి. అందుకే మార్కెట్‌లో అతి చౌకగా స్మార్ట్‌ఫోన్లు దొరికేస్తున్నాయి.
డేటా భద్రంగా ఉండాలనుకునే వారైతే యాపిల్ ఫోన్‌ను ఎక్కువ రేటైనా కొనేస్తారు. అందులో న్యూ మోడల్ లాంచ్ చేస్తే అటువైపే మొగ్గు చూపుతున్నారు. అదే మధ్య తరగతి, పేదవారు రూ.10 వేల లోపు ఉండే ఫోన్లనే కొనేందుకు మొగ్గు చూపుతారు. సెల్‌ఫోన్ కంపెనీల ప్రధాన టార్గెట్ ఇలాంటి మిడిల్ క్లాస్ వారే. వారి అభిరుచులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్ ఫోన్లను బడ్జెట్ రేంజ్లో లాంచ్ చేస్తుంటారు. తక్కువలో తక్కువ రూ.6000 నుంచి మంచి ఫోన్లు దొరుకుతుంటాయి. రేటు తక్కువగానే ఉన్నా ఫీచర్ల విషయంలో మాత్రం తగ్గేదే లే అన్నట్లు వినియోగదారులకు మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్నాయి.
తాజాగా ప్రముఖ ఫోన్ల దిగ్గజ సంస్థ సామ్‌సంగ్ తమ కస్టమర్ల కోసం బడ్జెట్ రేంజ్లో 5G ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే లాంఛ్ కానున్న ఈ ఫోన్ మోడల్ ఏంటి? రేట్ ఎంత? వెర్షన్ ఎలా ఉండబోతుంది? ఫీచర్లు ఎలా ఉన్నాయి? బ్యాటరీ బ్యాకప్? డేటా స్టోరీజీ ఎంత? కెమెరా కెపాసిటీ? తదితర పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
సామ్‌సంగ్ ఇండియా తెచ్చిన కొత్త మోడల్ పేరు గెలాక్సీ ఎఫ్06 5జీ. త్వరలోనే దీనిని లాంచ్ చేయనుంది. ధర కేవలం రూ.10,000లోపే ఉంటుందని సంస్థ ప్రకటించింది. సేల్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతోందో స్పష్టంగా చెప్పలేదు.
ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు :
- మోడల్ - సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ
- ధర - రూ.10,000 లోపు
- సైజు - 6.7 అంగుళాల ఎల్‌సీడీ తెర
- ప్రాసెసర్ - మీడియాటెక్ డీ6300
- బ్యాటరీ - 5000Mah
- కెమెరా - బ్యాక్ కెమెరా 50 మెగా పిక్సెల్, సెల్ఫీ కెమెరా - 8 ఎంపీ
- ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్ 14 విత్ వన్ యూఐ
- ర్యామ్ - 4జీబీ
- రోమ్ - 128 జీబీ మెమొరీ
NOTE : 4జీబీ ర్యామ్, 128 జీబీ రోమ్ ధర రూ.9,499 కాగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ రోమ్ ధర రూ.10,999గా నిర్ణయించారు.
కిర్రాక్ ఫీచర్లతో వివో నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు- లాంఛ్‌కు ముందే డీటెయిల్స్ లీక్!
పెరుగుతున్న స్మార్ట్ఫోన్ల ధరలు- అసలు తయారీకి కంపెనీలు ఎంత ఖర్చుపెడుతున్నాయో తెలుసా?