Next Generation of GPT 4 AI:ఏఐ ఆధారిత చాట్ జీపీటీని లాంచ్ చేసిన తర్వాత ఓపెన్ ఏఐ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ నుంచి రాబోతున్న తదుపరి తరం GPT-4 AI మోడల్ రిలీజ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ తరుణంలో కంపెనీ తన తదుపరి తరం GPT-4 AI మోడల్‌ను రిలీజ్ చేయట్లేదని స్పష్టం చేస్తూ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఓరియన్ అనే కోడ్‌నేమ్‌తో కూడిన AI మోడల్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేయడం లేదని సంస్థకు చెందిన ఓ ప్రతినిధి వెల్లడించారు.
"ఈ ఏడాది ఓరియన్ కోడ్‌నేమ్‌తో ప్రోటోటైప్‌ను రిలీజ్ చేయడానికి మేం ప్లాన్ చేయట్లేదు. వేరే ఇతర టెక్నాలజీలను తీసుకురావడంపై దృష్టి పెట్టాం." - ఓపెన్‌ఏఐ కంపెనీ ప్రతినిధి
కాగా ఓపెన్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌ను ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయాలని యోచిస్తున్నట్లు ఇటీవల కొన్ని నివేదికలు వెల్లడించాయి. దీంతో ఈ వార్త సర్వత్రా సంచలనం సృష్టించింది. అయితే ఈ నివేదికలను కంపెనీ కొట్టిపారేసింది. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. GPT-4 AI మోడల్ కంటే OpenAI నెక్స్ట్ మోడల్ మరింత శక్తివంతమైన, సామర్థ్యం కలిగి ఉంటుందని వెల్లడించింది. కంపెనీ దీన్ని డిసెంబర్లో తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌కు ఇంటర్నల్‌గా ఓరియన్ అని పేరు పెట్టారు. దీనిని మొదట్లో స్ట్రాబెర్రీ అని పిలిచేవారు. ఆ తర్వాత ఇది GPT-4o AI మోడల్‌గా మారింది.