Volvo XC40 Recharge renamed EX40:లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా తన 'వోల్వో XC40 రీఛార్జ్' ఎలక్ట్రిక్ ఎస్యూవీ పేరు మార్చింది. ఈ మేరకు దీని పేరు 'వోల్వో EX40'గా మార్చినట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాక దీని ధరను కూడా పెంచింది. ప్రస్తుతం రీనేమ్ చేసిన ఈ కారును ఈ ఏడాది ఫ్రిబ్రవరిలో గ్లోబల్‌గా పరిచయం చేసింది.
వోల్వో ఈవీ లైన్అప్ కార్లను ఇక మీదట ఈ పేరు మీదుగానే తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంటే తమ ఎలక్ట్రిక్ కార్లను 'E' పేరు వచ్చేలా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి పేరు మార్చారు. ఈ లైన్అప్లో 'EX30', 'EX90' కూడా ఉన్నాయి. వీటితో పాటు ఈ సూట్లో 'వోల్వో C40 రీఛార్జ్' కూపే-SUV కూడా వస్తుందని తెలుస్తోంది. దీన్ని 'వోల్వో EC40' పేరుతో పిలవనున్నారు.
'వోల్వో EX40'లో కొత్తగా ఏం ఉంది?: 'వోల్వో EX40' రియర్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 69kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 238 bhp పవర్, 420Nm టార్క్ అందిస్తుంది. ఈకారు ఫుల్ ఛార్జ్‌పై 475కిమీ (WLTP సైకిల్) రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే మెకానికల్‌గా దీనికి, 'XC40' రీఛార్జ్‌కు మధ్య డిఫరెన్స్ లేదు.
'వోల్వో EX40' ఫీచర్స్:'EX40'లో పిక్సెల్ LED హెడ్‌ల్యాంప్‌లు, రెండు-జోన్ క్లైమేట్ కంట్రోల్, 12-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, పార్క్ అసిస్ట్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఉన్నాయి. అయితే 'XC40 రీఛార్జ్' కారు సింగిల్-మోటార్ వేరియంట్లో చివరి రెండు ఫీచర్లు అందించలేదు.