Vivo V40e Launched in India:దసరా, దీపావళి పండగల నేపథ్యంలో స్మార్ట్ఫోన్లపై ప్రస్తుతం ఆఫర్ల జాతర నడుస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పలు సంస్థలు ఇప్పటికే భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే పలు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కొత్త కొత్త మోడల్స్‌లో స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
వివో వీ40ఈ పేరుతో దీన్ని ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేశారు. డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ మొబైల్ కెమెరా ఫీచర్లను కూడా వివో కంపెనీ వెల్లడించింది. దీంతోపాటు ఈ ఫోన్ 98 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 20 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్‌ను అందిస్తుందని తెలిపింది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్ వివో వీ40ప్రో మొబైల్ డిజైన్ లానే ఉంది. ఈ సందర్భంగా వివో వీ40ఈ స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు మీకోసం.
Vivo V40e ఫీచర్లు:
- డిస్ప్లే:6.77 అంగుళాల 3డీ కర్వ్డ్
- రిఫ్రెష్ రేట్:120Hz
- మందం: 0.749 సెంటీమీటర్లు
- వెయిట్: 183 గ్రాముల బరువుతో స్లిమ్ ప్రొఫైల్
- మెయిన్ కెమెరా:50 మెగా పిక్సెల్
- అల్ట్రావైడ్ కెమెరా:8 మెగాపిక్సెల్
- ఫ్రంట్ కెమెరా:50 మెగాపిక్సెల్ ఐ-ఏఎఫ్ కెమెరా
- సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్
- 2ఎక్స్ పోర్ట్రెయిట్ మోడ్
Vivo V40e ఇతర ఫీచర్లు:
- 8GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్
- ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్
- పీక్ బ్రైట్నెస్: 4500నిట్స్
- బ్యాటరీ: 5500 ఎంఏహెచ్
- 8W ఫ్లాష్ ఛార్జ్
- వెట్ టచ్ ఫీచర్
- ఏఐ ఎరేజర్
- ఏఐ ఫొటో ఎన్‌హాన్సర్
- IP64 రేటింగ్
- బ్లూటూత్ 5.4
- యూఎస్‌బీ టైప్- సీ పోర్ట్
Vivo V40e స్మార్ట్‌ఫోన్‌లో కలర్ ఆప్షన్స్: ఈ సరికొత్త వివో వీ40ఈ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో మార్కెట్లో అందుబాటులో ఉంది.
- రాయల్ బ్రాంజ్
- మింట్ గ్రీన్