ETV Bharat / technology

డైనమిక్ లైట్ ఫీచర్, అతిపెద్ద బ్యాటరీ​తో వివో 5G స్మార్ట్​ఫోన్- రూ. 15,000లకే! - VIVO T3X 5G LAUNCH DATE IN INDIA

త్వరలో దేశీయ మార్కెట్​లో వివో T3x 5G లాంఛ్- డీటెయిల్స్ ఇవిగో!

Picture is of Vivo T3x 5G
Picture is of Vivo T3x 5G (Photo Credit- VIVO)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 16, 2025, 5:04 PM IST

Vivo T3x 5G Launch Date in India: దేశీయ మార్కెట్​లోకి వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. ఈ మేరకు వివో T4x 5G పేరుతో కొత్త ఫోన్​ను లాంఛ్ చేయనున్నట్లు టీజర్ రిలీజ్ చేసింది. గత కొన్ని నెలలుగా దీనిపై పుకార్లు షికార్లు చేస్తుండగా కంపెనీ ఇప్పుడు త్వరలోనే దీన్ని లాంఛ్ చేయనున్నట్లు కన్ఫార్మ్ చేసింది. వివో ఈ ఫోన్​ను మార్చి నెలలో భారత మార్కెట్లో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ గతంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే BIS వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. ఈ సందర్భంగా దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

వివో T4X 5G టీజర్ రిలీజ్: వివో ఈ స్మార్ట్​ఫోన్ టీజర్​ను ఫ్లిప్‌కార్ట్‌లో రిలీజ్ చేసింది. ఈ అప్​కమింగ్ స్మార్ట్​ఫోన్ గతేడాది రూ. 13,499కి లాంఛ్​ అయిన 'వివో T3X 5G' అప్​గ్రేడ్​ వెర్షన్. ఇప్పుడు ఈ అప్​కమింగ్ 'వివో T4X 5G' ఫోన్ మైక్రోసైట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్​కార్ట్​లో షేర్ అయింది. ఇక ఇది ఈ సెగ్మెంట్​లో అతిపెద్ద బ్యాటరీతో రాబోతుందని కంపెనీ తన టీజర్​లో పేర్కొంది.

అయితే ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ, ఇతర స్పెసిఫికేషన్ల వివరాల గురించి వివో ఇంకా కచ్చితమైన సమాచారం అందించలేదు. కానీ కంపెనీ 'వివో T3X 5G' లో 6000mAh బ్యాటరీని ఇచ్చింది. దీంతో ఈ ఫోన్​ను అప్​గ్రేడ్ వెర్షన్​గా వస్తున్న 'వివో T4X 5G' ఫోన్​లో కంపెనీ 6,500mAh బ్యాటరీని అందించొచ్చని అంచనా వేయొచ్చు.

ఇది కాకుండా కంపెనీ ఈ ఫోన్​ను మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ చిప్​సెట్ 7,28,000 AnTuTu స్కోర్ చేసిందని ఓ నివేదిక సమాచారం అందించింది. ఇక గతేడాది ప్రారంభించిన 'వివో T3X 5G'లో కంపెనీ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్‌సెట్‌ను అందించింది.

వీటితో పాటు కంపెనీ ఈ అప్​కమింగ్ ఫోన్​లో డైనమిక్ లైట్ ఫీచర్‌ను అందించొచ్చు. ఇది వినియోగదారులకు కస్టమైజ్డ్ లైట్నింగ్ ఎఫెక్స్ట్​తో నోటిఫికేషన్​లను అందించడంలో సహాయపడుతుంది.

కలర్ ఆప్షన్స్: కంపెనీ దీన్ని ఈ కింది కలర్ ఆప్షన్​లతో లాంఛ్ చేయొచ్చు.

  • పర్పుల్
  • బ్లూ

లాంఛ్ టైమ్‌లైన్: వివో ఈ అప్​కమింగ్ స్మార్ట్​ఫోన్​ను మార్చి 2025లో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ధర: కంపెనీ ఈ ఫోన్​ను దాదాపు రూ. 15,000 ధరతో ఇండియన్ మార్కెట్​లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

గగన్​యాన్​తో మరో అద్భుతానికి ఇస్రో రెడీ!- ఈ ఏడాదే మొదటి ఫ్లైట్​ లాంఛ్- షెడ్యూల్ ఇదే!

వాట్సాప్​లో భలే కొత్త ఫీచర్​- ఇకపై మీ చాట్​ను రంగులతో నింపేయొచ్చు- ఎలాగంటే?

మహింద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్స్ స్టార్ట్- ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు వివరాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.