Upcoming Smartphone Launches in February 2025:ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఫిబ్రవరి నెలలో కూడా అదిరే ఫీచర్లతో సరికొత్త ఫోన్లను తీసుకొచ్చేందుకు అనేక కంపెనీలు రెడీ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు భారత్‌తో పాటు ఇతర దేశాల్లో తమ లేటెస్ట్ మోడల్స్‌ను లాంఛ్ చేయబోతున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
1. iQOO Neo 10R: వివో సంబ్-బ్రాండ్ కంపెనీ ఐకూ భారతదేశంలో ఫ్లాగ్‌షిప్ పెర్ఫార్మెన్స్తో 'ఐకూ నియో 10R' అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు రెడీ అయింది. వినియోగదారుల గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కంపెనీ దీన్ని తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ టీజర్‌ను కూడా వివో విడుదల చేసింది. అయితే ఇంకా లాంఛ్ డేట్‌ను ప్రకటించలేదు. కానీ ఈ నెలలో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ పోస్ట్, దీనిపై వచ్చిన అనేక లీక్స్ ప్రకారం ఈ ఫోన్ 6400mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K AMOLED డిస్‌ప్లేతో పాటు అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌పై మరిన్ని వివరాలు తీసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
2. Vivo V50 Series: వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ 'వివో V50 సిరీస్' పేరుతో ఈ లైనప్‌ను ప్రారంభించనుంది. ఈ సిరీస్‌లో 'వివో V50', 'వివో V50 ప్రో' అనే రెండు మోడల్స్‌ను తీసుకురానుంది. వీటిలో 6000mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరాను అందించొచ్చు. దీనిపై మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3. Xiaomi 15 Series:షావోమీ కూడా ఈ ఫిబ్రవరిలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. 'షావోమీ 15' పేరుతో ఈ సిరీస్‌ను తీసుకురానుంది. కంపెనీ ఈ సిరీస్‌లో 'షావోమీ 15', 'షావోమీ 15 ప్రో' అనే రెండు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేయనుంది. అయితే కంపెనీ ఈ ఫోన్ అధికారిక లాంఛ్ తేదీని ప్రకటించలేదు. కానీ ఫిబ్రవరి చివరిలో ఈ ఫోన్ దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక గతేడాది మార్చి 7న భారత మార్కెట్లో 'షావోమీ 14 సిరీస్' లాంఛ్ అయ్యాయి.
4. Realme P3 Pro: రియల్మీ ఈ ఫోన్‌ను ఫిబ్రవరి మూడో వారంలో లాంఛ్ చేయొచ్చు. ఈ ఫోన్ దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కంపెనీ ఈ 'రియల్మీ P3 ప్రో' స్మార్ట్‌ఫోన్ లాంఛ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. లీకైన నివేదికల ప్రకారం ఇది 5000mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ వంటి అనేక ప్రతేక ఫీచర్లతో వస్తుంది.
5. Samsung Galaxy A56 5G:శామ్సంగ్ కూడా ఈ నెలలో తన 'A' లైనప్‌లో 'శాంసంగ్ గెలాక్సీ A56 5G' అనే కొత్త ఫోన్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. టిప్‌స్టర్ ప్రకారం ఈ ఫోన్‌కు 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ HD ప్లస్ డైనమిక్ AMOLED డిస్‌ప్లేతో రావచ్చు. అంతేకాక ఇది 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని లీక్స్ వచ్చాయి.
6. Samsung Galaxy A36 5G:శామ్సంగ్ తన 'A' లైనప్‌లో రెండు కొత్త ఫోన్‌లను విడుదల చేయొచ్చు. వాటిలో రెండో మోడల్ ఫోన్ పేరు 'శాంసంగ్ గెలాక్సీ A36 5G' కావచ్చు. నివేదిక ప్రకారం కంపెనీ ఈ ఫోన్‌లో ప్రాసెసర్ కోసం క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 SoC లేదా స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్‌ను ఉపయోగించొచ్చు. అదే సమయంలో ఈ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ కోసం Android 15 బేస్డ్ One UI 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించొచ్చు. వీటితో పాటు ఈ ఫోన్ 50MP రియర్ కెమెరాతో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.