Suzuki Access 125:మారుతి సుజుకి ఇండియాకు చెందిన 'యాక్సెస్ 125' స్కూటర్ అరుదైన ఘనత సాధించింది. ఈ మోడల్ అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతూ కంపెనీ సేల్స్ పెరగడంలో కీలక పాత్రను పోషించింది. కంపెనీ తన ప్లాంట్లలో ఈ మోడల్‌ను ఏకంగా 60 లక్షల యూనిట్ల ప్రొడక్షన్‌ను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో కంపెనీ చరిత్రలోనే హై డిమాండ్ ఉన్న స్కూటర్‌గా 'సుజుకి యాక్సెస్ 125' నిలిచింది. ఈ స్కూటర్ సాధించిన ఘనతపై సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ ఆనందం వ్యక్తం చేశారు.
"సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ 6మిలియన్ల ప్రొడక్షన్ అనేది కంపెనీకి ఓ సిగ్నిఫికెంట్ మూమెంట్. ఇది దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో యాక్సెస్ 125పై మా కస్టమర్లు చూపిన విశ్వాసాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. టూ-వీలర్ రంగంలో ఈ యాక్సెస్ 125 మంచి ప్రజాదరణతో దూసుకుపోవటంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా కస్టమర్లకు రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరిచే ఉత్తత్తులను అందించేందుకు మేం ఎదురుచూస్తున్నాం."- కెనిచి ఉమెడ, సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్
'సుజుకి యాక్సెస్ 125' పవర్‌ట్రెయిన్: ఈ స్కూటర్ 2006లో ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. 125cc సెగ్మెంట్లో కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. ఈ స్కూటర్లో 124cc, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8.6 bhp పవర్, 10 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఫీచర్లు:దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్కూటర్ సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ (SEP) టెక్నాలజీ, అధునాతన ఫ్యూయల్ ఇంజెక్షన్, ఎకో అసిస్ట్ ఇల్యూమినేటర్తో వస్తుంది. వీటితో పాటు ఇది 22.3 లీటర్ల లార్జ్ అండర్-సీట్ స్టోరేజ్, సుజుకి ఈజీ స్టార్ట్ సిస్టమ్, లాంగ్ సీట్, వైడ్ ఫ్లోర్‌బోర్డ్ వంటి ఫీచర్లతో మంచి పెర్ఫార్మెన్స్, కంఫర్ట్‌ను అందిస్తుంది.