ETV Bharat / technology

ఖరీదైన రీఛార్జ్​ ప్లాన్​లతో మీ జేబుకు చిల్లు పడుతోందా?- అయితే ఈ చౌకైనవి ట్రై చేయండి! - BSNL AFFORDABLE RECHARGE PLAN

ధర తక్కువ బెనిఫిట్స్ ఎక్కువ!- దీర్ఘకాలిక వ్యాలిడిటీతో రూ. 900లోపు బెస్ట్ ప్లాన్స్​ ఇవే!

BSNL
BSNL (Photo Credit- BSNL)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 13, 2025, 1:31 PM IST

Updated : Feb 13, 2025, 6:36 PM IST

BSNL Recharge Plan: ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఖరీదైన రీఛార్జ్​ ప్లాన్​లతో మొబైల్ వినియోగదారుల జేబులకు చిల్లు పడుతున్నాయి. TRAI ఆదేశాలతో ఇటీవలే ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీలు కాలింగ్, SMS ఓన్లీ ప్లాన్​లను ప్రారంభినా వాటి ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో తక్కువ ధరలోనే రీఛార్జ్ ప్లాన్స్ ఏ నెట్‌వర్క్ ఇస్తుందోనని యూజర్లు చూస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో వీరందరికీ ప్రభుత్వ యాజమాన్యంలోని ఏకైక టెలికాం సంస్థ BSNL ఓ ప్రత్యామ్నాయంగా మారింది. ఈ కంపెనీ చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లకు ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో BSNL అందిస్తున్న​ ప్లాన్​ల గురించి తెలుసుకుందాం రండి. అది కూడా కేవలం రూ. 900లోపు ధరతో ఉన్న రీఛార్జ్​ ప్లాన్​ల వివరాలు మీకోసం.

BSNL రూ. 897 రీఛార్జ్ ప్లాన్: మీరు ఎక్కువ కాలం వ్యాలిడిటీతో కాల్, డేటా, SMS సౌకర్యాలను అందించే ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ రీఛార్జ్​ ప్యాక్​ మీకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కేవలం 897 రూపాయలకే 180 రోజులు అంటే దాదాపు 6 నెలల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ వ్యవధిలో వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉచిత కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు. దీనితో పాటు కస్టమర్లు రోజుకు 100 SMSలు లభిస్తాయి. అంతేకాదండోయ్ BSNL ఈ రీఛార్జ్​ ప్లాన్​తో 180 రోజుల పాటు మొత్తం 90GB డేటాను కూడా అందిస్తోంది.

BSNL రూ. 797 రీఛార్జ్ ప్లాన్: BSNL నుంచి తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్​ను అందించే ప్లాన్​లలో ఇది ఒకటి. ఇది ఏకంగా 300 రోజులు అంటే దాదాపు 10 నెలల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్​​తో సబ్‌స్క్రైబర్‌లు జియో, వొడాఫోన్-ఐడియా(Vi), ఎయిర్​టెల్ వంటి అన్ని నెట్‌వర్క్‌లలో అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. అయితే ఈ ప్లాన్​తో కస్టమర్‌లు 60 రోజుల పాటు మాత్రమే అన్​లిమిటెడ్ కాల్స్ ప్రయోజనాలను పొందగలరు.

అదేవిధంగా కంపెనీ ఈ ప్లాన్​తో మొత్తం 600GB డేటాను అందిస్తుంది. వినియోగదారులు మొదటి 60 రోజుల పాటు ప్రతిరోజూ 2GB డేటాను ఉపయోగించగలరు. ఆ తర్వాత డేటా స్పీడ్ 40 kbpsకి తగ్గుతుంది. అంతేకాక ఈ ప్లాన్​తో SMS ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రీఛార్జ్‌తో మొదటి 60 రోజుల వరకు మీరు ప్రతిరోజూ 100 SMSలను పంపగలరు.

వీటితో పాటు BSNL నుంచి ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో మంచి బెనిఫిట్స్​ను అందించే మరో రీఛార్జ్​ ప్లాన్​ కూడా ఉంది. అయితే దీని ధర 1,198 రూపాయలు. దీర్ఘకాలిక వ్యాలిడిటీ కోసం BSNL ఈ రీఛార్జ్ ప్లాన్​ను ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్​ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. అంటే మీరు ఈ రోజు ఈ రీఛార్జ్ చేస్తే 2026 వరకు కొత్త రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే డ్యూయల్ సిమ్ వినియోగదారులకు ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సిమ్‌ను ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచడానికి ఈ ప్లాన్ చాలా బాగుంది. ఇది మాత్రమే కాకుండా ఈ ప్లాన్‌లో అనేక ఇతర ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్లాన్​తో కంపెనీ ఒక సంవత్సరం చెల్లుబాటుతో నెలకు 300 నిమిషాల కాలింగ్ బెనిఫిట్​ను అందిస్తోంది. మీరు ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. దీనితో పాటు ఈ ప్లాన్​లో ప్రతి నెలా 3GB డేటా, 30 SMSలు కూడా లభిస్తాయి. అంటే మీరు ఈ రీఛార్జ్​ ప్లాన్‌తో దీర్ఘకాలిక వ్యాలిడిటీతో పాటు కాల్ అండ్ డేటా ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ఇది BSNL నుంచి ఏడాది పాటు వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్న చౌకైన రీఛార్జ్​ ప్లాన్​.

క్రూ-10 మిషన్​లో కీలక మార్పులు!- షెడ్యూల్​ కంటే ముందుగానే భూమికి సునీతా?

గీక్​బెంచ్​లో శాంసంగ్ అల్ట్రా-స్లిమ్ ఫ్లాగ్​షిప్ ​ఫోన్!- దీని ప్రాసెసర్​ గురించి తెలిసిపోయిందిగా!

హై మైలేజ్ ఎలక్ట్రిక్ స్కూటీ లాంఛ్- ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ!

Last Updated : Feb 13, 2025, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.