ETV Bharat / state

"నువ్వు నన్ను కొడతావా" రెచ్చిపోయిన ఖాతాదారుడు - చోద్యం చూసిన బ్యాంకు సిబ్బంది - CUSTOMERS FIGHT AT UNION BANK

యూనియన్ బ్యాంకులో ఖాతాదారుల మధ్య గొడవ - చోద్యం చూస్తూ కూర్చున్న బ్యాంక్ అధికారులు - బ్యాంకులో గందరగోళ పరిస్థితి

Fight Between Customers At Union Bank In Huzurnagar
Fight Between Customers At Union Bank In Huzurnagar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2025, 5:25 PM IST

Fight Between Customers At Union Bank In Huzurnagar : యూనియన్ బ్యాంకులో ఖాతాదారుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ చోటు చేసుకుంది. "నువ్వు నన్ను కొడతావా" అంటూ ఓ ఖాతాదారుడు రెచ్చిపోయారు. కానీ అక్కడే ఉన్న బ్యాంకు సిబ్బంది మాత్రం వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్​లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే,

కొద్దిపాటి తోపులాట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రైతు భరోసా డబ్బులు అన్నదాతల అకౌంట్లో జమ చేసిన విషయం తెలసింది. ఈ డబ్బులను విత్ డ్రా చేసుకునేందుకు, అలాగే నగదు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి రైతులు బ్యాంకులకు క్యూ కట్టారు. ఈ సందర్భంలో హుజూర్‌నగర్​లోని యూనియన్ బ్యాంకులో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ఖాతాదారులు డబ్బులు తీసుకోవాడానికి లైన్​లో నిలబడ్డారు. ఈ సమయంలో కొద్దిపాటి తొపులాట జరగడంతో ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. దీంతో ఖాతాదారుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ చోటు చేసుకుంది. "నువ్వు నన్ను కొడతావా" అంటూ ఓ ఖాతాదారుడు రెచ్చిపోయారు. కానీ అక్కడే ఉన్న బ్యాంకు సిబ్బంది వారిని వారించే ప్రయత్నం చేయలేదు. చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఈ గొడవను గమనిచింన సెక్యూరిటీ కలగజేసుకొని ఖాతాదారుల గొడవ సద్దుమణిగేలా చేశారు. దీంతో బ్యాంకులో గందరగోళ పరిస్థితి నెలకొంది.

తీవ్ర ఇబ్బందులుకు గురి చేస్తున్నారు : ఈ సందర్భంలో యూనియన్ బ్యాంకు అధికారులపై ఖాతాదారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులో సరిపడా సిబ్బంది లేరని ఖాతాదారులు ఆరోపించారు. ఈ బ్యాంక్​కి వస్తే ఏ పని అయినా సరే ఒక రోజు రెండు రోజులు తిరగాల్సి వస్తుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులను ఎదైనా అడిగితే సరైన చెప్పకుండా దాటవేస్తూ తీవ్ర ఇబ్బందులుకు గురి చేస్తున్నారని ఖాతాదారులు ఆరోపించారు.

సమాధానం చెప్పని బ్యాంకు సిబ్బంది : యూనియన్ బ్యాంకులో ఖాతాదారుల మధ్య చోటు చేసుకున్న గొడవ గురించి బ్యాంకు అధికారులను ప్రశ్నించగా వారు సమాధానం చెప్పకుండా దాటవేశారు.

'నాకు లెగ్​ పీస్ వేయలే - నేను డబ్బులివ్వను' : చికెన్ కోసం పగిలిన తల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.