Skoda Kylaq Global Debut: స్కోడా ఆటో ఇండియా సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ ఈ విభాగంలో తన మొదటి కారు 'స్కోడా కైలాక్'ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. దీని బుకింగ్స్ డిసెంబర్ 2, 2024 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఎస్‌యూవీని కంపెనీ జనవరి 17, 2025న జరిగే భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఆవిష్కరించనుంది. దీని డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.
స్కోడా కైలాక్ డిజైన్:కైలాక్ భారతదేశంలో మొట్టమొదటి స్కోడా కారు. ఈ కారును కొత్త మోడ్రన్ సాలిడ్ డిజైన్‌తో తీసుకొచ్చారు. దీని ముందు భాగంలో బటర్‌ఫ్లై గ్రిల్ ఉంది. ఇది స్లిమ్ LED DRLలతో చుట్టి ఉంటుంది. దీనిలో మెయిన్ హెడ్‌ల్యాంప్‌లు కిందికి ఉన్నాయి. దీని బంపర్ సెంటర్ ప్రామినెంట్ ఎయిర్ వెంట్, దిగువన ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో వస్తుంది.
ఈ కారు టాప్ మోడల్‌లో డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని వెనుక డిజైన్ స్కోడా నుంచి వచ్చిన పాపులర్ ఎస్యూవీ కుషాక్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది బ్లాక్ ట్రిమ్ స్ట్రిప్‌తో అటాచ్ చేసిన ప్లెయిన్ లుక్‌లో టెయిల్ల్యాంప్స్ను కలిగి ఉంది. దీని వెనక బంపర్ చాలా క్లాడింగ్, మెయిన్ స్కిడ్ ప్లేట్ ఎలిమెంట్‌తో వస్తుంది.
స్కోడా కైలాక్ ఇంటీరియర్:దీని క్యాబిన్ డిజైన్ కుషాక్ ఎస్యూవీను పోలి ఉంటుంది. దీని టాప్ మోడల్‌లో 10-అంగుళాల సెంటర్ టచ్‌స్క్రీన్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, నిలువుగా ఓరియెంటెడ్ సైడ్ వెంట్స్ ఉన్నాయి. ఇది స్కోడా స్లావియా, కుషాక్ ఇంటీరియర్‌ను పోలి ఉంటుంది.
ఇతర ఫీచర్లు:
- పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు
- సన్‌రూఫ్
- వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
- వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్
- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్