ETV Bharat / technology

స్టైలిష్ లుక్, టాప్ స్పెసిఫికేషన్స్.. కవాసకి కొత్త డ్యూయల్ స్పోర్ట్ బైక్ లాంఛ్- ఇది చాలా కాస్ట్లీ గురూ! - KAWASAKI KLX230 LAUNCHED IN INDIA

ఇండియన్ మార్కెట్లోకి కవాసకి KLX230 బైక్- ధర ఎంతో తెలిస్తే షాకే!

Kawasaki KLX230
Kawasaki KLX230 (Photo Credit- Kawasaki India)
author img

By ETV Bharat Tech Team

Published : 14 hours ago

Kawasaki KLX230 Launched in India: బైక్​ లవర్స్​కు గుడ్​న్యూస్. మార్కెట్లోకి ప్రీమియం ఫీచర్లతో సరికొత్త మోటార్​సైకిల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ మోటార్​సైకిల్ తయారీ సంస్థ కవాసకి ఇండియా దీన్ని తీసుకొచ్చింది. 'కవాసకి KLX230' పేరుతో దీన్ని తీసుకొచ్చారు. కంపెనీ ఈ డర్ట్ బైక్​ను రూ. 3.30 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో విడుదల చేసింది. ఈ ధరతో ఇది ఇండియాలో అత్యంత ఖరీదైన రోడ్- లీగల్ డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైకిల్​గా మారింది. ఈ సందర్భంగా దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.

స్పెసిఫికేషన్లు: ఈ కొత్త 'కవాసకి KLX230' బైక్​ 233cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్​తో వస్తుంది. ఇది 8,000rpm వద్ద 18bhp శక్తి, 6,400rpm వద్ద 18.3Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

అయితే ఈ మోటార్​ సైకిల్ ఫ్యూయల్​ ట్యాంక్​ చాలా చిన్నది. ఇది కేవలం 7.6 లీటర్లు మాత్రమే. ఇది ముందువైపు 240mm ట్రావెల్‌తో 37mm టెలిస్కోపిక్ ఫోర్క్, వెనకవైపు 250mm ట్రావెల్‌తో కూడిన మోనోషాక్ అబ్జార్బర్‌ని కలిగి ఉంది.

ఫీచర్లు: ఈ కొత్త 'కవాసకి KLX230' మోటార్​లోని ఫీచర్ లిస్ట్ చాలా తక్కువ. ఈ బైక్ మోనోటోన్ LCDని కలిగి ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. వీటితో పాటు ఈ మోటార్​సైకిల్ డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది. ఈ కొత్త బైక్ లైట్​ వెయిట్​తో వస్తుంది. దీని బరువు 139 కిలోలు. ఇక ఈ బైక్ 880mm ఎత్తుతో సీటును కలిగి ఉంది. కావాలంటే ఈ బైక్​లో తక్కువ ఎత్తున్న సీటు ఆప్షన్​ కూడా ఉంది.

మార్కెట్లో దీనికి ప్రత్యర్థులు: ప్రస్తుతం ఈ కొత్త 'కవాసకి KLX230' మోటార్​సైకిల్.. 'హీరో Xpulse 200 4V', 'Xpulse 200 4V Pro'తో పోటీ పడుతోంది. వీటి ధరలు వరుసగా రూ. 1.51 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా), రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. వీటితో పోల్చి చూస్తే 'కవాసకి KLX230' రెండు రెట్లు ఖరీదైనది.

అద్భుతమైన ఫీచర్లతో 'షావోమీ ప్యాడ్ 7'- ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

'వన్‌ప్లస్ 12' స్మార్ట్​ఫోన్​పై భారీ డిస్కౌంట్- ఏకంగా రూ.7,000 వరకు తగ్గింపు!- ఎక్కడంటే?

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిర్​టెల్ సేవలు- ఆందోళనలో వినియోగదారులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.