Xiaomi Pad 7 Launch date in India: ఇండియన్ మార్కెట్లోకి 'షావోమీ ప్యాడ్ 7' టాబ్లెట్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. మరికొన్ని రోజుల్లో కంపెనీ దీన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో లైవ్ మైక్రోసైట్‌ను రిలీజ్ చేసింది. దీని ద్వారా ఈ కొత్త టాబ్లెట్ లాంఛ్ తేదీనీ రివీల్ చేసింది.
రిలీజ్ ఎప్పుటంటే?: కంపెనీ ఈ టాబ్లెట్‌ను ఇండియాలో జనవరి 10, 2025న విడుదల చేయనున్నట్లు కన్ఫార్మ్ చేసింది. కాగా ఈ సిరీస్‌లో 'షావోమీ ప్యాడ్ 7', 'షావోమీ ప్యాడ్ 7 ప్రో' టాబ్లెట్లను ఇటీవలే అక్టోబర్ నెలలో చైనా మార్కెట్లో లాంఛ్ చేసింది. ఇప్పుడు షావోమీ.. దేశీయ మార్కెట్లోకి కూడా దీన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
షావోమీ ఈ అప్‌కమింగ్ ఇండియన్ వెర్షన్ టాబ్లెట్ రిలీజ్ డేట్‌ను అమెజాన్‌లో మైక్రోసైట్ ద్వారా వెల్లడించింది. అంటే 'షావోమీ ప్యాడ్ 7' అమెజాన్‌లో విక్రయానికి అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ టాబ్లెట్‌పై మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇక ఈ టాబ్లెట్ ఇండియన్ వేరియంట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు చైనాలో లాంఛ్ అయిన మోడల్‌ని పోలి ఉండొచ్చు.
ఫీచర్లు: 'షావోమీ ప్యాడ్ 7' చైనీస్ వేరియంట్ 11.2-అంగుళాల LCD స్క్రీన్‌తో 3.2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో తీసుకొచ్చారు. దీంతోపాటు ఇది 800 నిట్‌ల బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ టాబ్లెట్ డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 SoC చిప్‌సెట్‌ని కలిగి ఉంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్‌తో రన్ అవుతుంది.
దీంతోపాటు చైనీస్ వేరియంట్లో ఈ టాబ్లెట్ 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 8,850mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అంతేకాక సెక్యూరిటీ కోసం ఈ టాబ్లెట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.
కలర్ ఆప్షన్స్: కంపెనీ దీన్ని మూడు కలర్ ఆప్షన్లతో చైనా మార్కెట్లో రిలీజ్ చేసింది.
- బ్లాక్
- బ్లూ
- గ్రీన్
వేరియంట్స్: చైనా మార్కెట్లో ఇది మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది.
- 8GB RAM + 128GB వేరియంట్
- 8GB RAM + 256GB వేరియంట్
- 12GB RAM + 256GB వేరియంట్
ధర: ఈ కొత్త టాబ్లెట్ ధర విషయానికొస్తే.. చైనాలో దీని ధర CNY 1,999 (దాదాపు రూ. 23,500) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో కస్టమర్లు 8GB RAM, 128GB స్టోరేజ్‌ను పొందుతారు. దీని 8GB RAM + 256GB వేరియంట్ ధర CNY 2,299 (దాదాపు రూ. 27,700). ఇక దీని 12GB + 256GB వేరియంట్ ధర CNY 2,599 (దాదాపు రూ. 30,600).
'వన్‌ప్లస్ 12' స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్- ఏకంగా రూ.7,000 వరకు తగ్గింపు!- ఎక్కడంటే?
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిర్టెల్ సేవలు- ఆందోళనలో వినియోగదారులు!
మంచి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలా?- కిర్రాక్ ఫీచర్లతో 2024లో టాప్ ఇవే!