తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఇండియాలోని టాప్-7 యూట్యూబర్స్ - ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? - How To Become A YouTuber

Richest YouTubers In India : యూట్యూబ్ కొంద‌రికి టైమ్ పాస్ అయితే, మ‌రికొంద‌రికి ఇది నేమ్​ & ఫేమ్ తీసుకువచ్చే ఒక మార్గం. అంతేకాదు చాలా మంది స్టార్​ యూట్యూబర్లు ఇక్కడ భారీగా డబ్బులు సంపాదించి మిలియనీర్లు కూడా అయ్యారు. వారిలో ఇండియాలోని టాప్-7 యూట్యూబ‌ర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

richest YouTubers of India
Richest YouTubers In India

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 11:18 AM IST

Richest YouTubers In India :యూట్యూబ్ వ‌ల్ల ఆనంద‌మే కాదు, డబ్బు కూడా వ‌స్తుంది. కొందిర‌కి ఇది టైమ్ పాస్ అయితే, మ‌రికొంద‌రికి డ‌బ్బు సంపాద‌న మార్గం. త‌మ టాలెంట్​తో కంటెంట్ క్రియేట్ చేసి డబ్బుతో పాటు, మంచి పేరు, ప్ర‌తిష్ఠ‌లు కూడా సంపాదిస్తున్నారు. అలా మన ఇండియాలో కూడా మంచి పాపులరిటీతోపాటు బాగా డబ్బు సంపాదించిన యూట్యూబర్స్ ఎందరో ఉన్నారు. వారిలోని టాప్-7 యూట్యూబ‌ర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. గౌరవ్ చౌదరి - Technical Guruji
గౌరవ్ చౌదరి ఇండియాలోని ప్ర‌ముఖ టెక్నిక‌ల్ యూట్యూబర్. లేటెస్ట్ గ్యాడ్జెట్‌లు, సాఫ్ట్​వేర్ అప్​డేట్స్​తో పాటు మార్కెట్లోకి వ‌చ్చిన డివైజ్​లను రివ్యూ చేయ‌డం ఇత‌ని ప‌ని. హిందీ భాష‌లో టెక్నిక‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇస్తాడు. దీని వ‌ల్ల హిందీ మాట్లాడే ప్ర‌జ‌ల‌కు బాగా చేరువ‌య్యాడు. అతని నికర సంపాదన దాదాపు 45 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో అయితే దాదాపు రూ.356 కోట్లు.

2. భువన్ బామ్ - BB Ki Vines
దేశంలోని అత్యంత ధ‌నిక యూట్యూబ‌ర్ల‌లో భువ‌న్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇత‌నికి BB Ki Vines అనే కామెడీ ఛాన‌ల్ ఉంది. దీనికి 26 మిలియ‌న్ల‌కు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇత‌ని సంపాద‌న రూ.122 కోట్లకు పైగానే ఉంటుంది. తొలుత సంగీతకారుడిగా కెరీర్​ ప్రారంభించిన ఈ 30 ఏళ్ల సంచ‌ల‌నం, త‌ర్వాత కామెడీ ఛాన‌ల్ ద్వారా సూపర్​ పాపుల‌ర్ అయ్యాడు.

3. సందీప్ మహేశ్వరి - Sandeep Maheshwari
సందీప్ మహేశ్వరి ఛానెల్​కు 27.8 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇత‌ని కంటెంట్ అంతా ప‌ర్స‌నల్ డెవ‌ల‌ప్​మెంట్, ప‌బ్లిక్ స్పీకింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్​ పెంచ‌డం లాంటి టాపిక్స్​ మీద ఉంటుంది. త‌న ప్రాక్టిక‌ల్ అడ్వైజ్​లు, అత‌ను చెప్పే విధానం, అత‌డిని ఒక రోల్​ మోడ‌ల్​గా నిలిపాయి. అతని నికర సంపాదన దాదాపు 5 మిలియన్ డాల‌ర్లు. అంటే సుమారుగా రూ.41 కోట్లు.

4. అజేయ్ నగర్ - CarryMinati
అజేయ్ నగర్‌కు క్యారీమినాటి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇత‌ని ఛానల్​కి 39.2 మిలియన్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. "CarryisLive పేరుతో అత‌ను ఆడే ఆన్​లైన్ లైవ్ గేమింగ్ సెష‌న్ చాలా పాపులర్​. దీనితో ఇతను యూట్యూబ‌ర్​గా ఫేమ‌స్ అయ్యాడు. ఇత‌ని సంపాద‌న విలువ 5 మిలియన్ డాల‌ర్లు (సుమారుగా రూ.41 కోట్లు).

5. దిల్ రాజ్ సింగ్ - Mr. Indian Hacker
దిల్ రాజ్ సింగ్ లైఫ్ హ్యాక్స్, సైంటిఫిక్ ఎక్స్​పెరిమెంట్స్​, DIY ప్రాజెక్ట్‌ వీడియోలు చేస్తుంటాడు. అత‌ని ఛానల్​ని 31.7 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఫాలో అవుతున్నారు. ఎంట‌ర్​టైన్​మెంట్​తోపాటు నాలెడ్జ్​ని కోరుకునేవారు ఇత‌ని వీడియోలు ఎక్కువ‌గా చూస్తారు. ఇతని ఆదాయం దాదాపుగా 2 మిలియన్ డాలర్లు (రూ.16 కోట్లు).

6. ఆశిష్ చంచలానీ - Ashish Chanchlani
ఆశిష్ మల్టీ టాలెంటెడ్ కంటెంట్ క్రియేట‌ర్. ఎక్కువ‌గా కామిక్ స్కెచ్‌లు, దానికి సంబంధించి వీడియోలు చేస్తూ ఉంటాడు. త‌న వీడియోల్లో ఒకటి కంటే ఎక్కువ పాత్ర‌ల్ని పోషిస్తుంటాడు. మంచి హ్యూమర్​/ కామెడీని పండిస్తాడు. ఆశిష్ ఆదాయం దాదాపు 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.40 కోట్లు).

7. అమిత్ బాడాన - Amit Bhadana
అమిత్ బాడాన వాస్త‌వానికి ఒక లాయ‌ర్. కానీ యూట్యూబ్​లో కామిడీ వీడియోలు చేస్తుంటాడు. కామెడీ స్కిట్స్​కి, కామెంట్రీకి ఇతను చాలా ఫేమ‌స్. ఇత‌నికి 24 మిలియ‌న్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇతని సంపాదన దాదాపు 7 మిలియన్ డాలర్లు (రూ.58 కోట్లు).

యూట్యూబర్స్​​ ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? వింటే షాక్​ అవడం గ్యారెంటీ!

యూట్యూబ్ క్రియేటర్ల కోసం బెస్ట్ AI టూల్స్! అంతా ఫ్రీనే! ఏమేం చేయొచ్చో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details