తెలంగాణ

telangana

ETV Bharat / technology

మహిళలూ జాగ్రత్త- ఇవి ఉంటే మీరు ఎక్కడికెళ్లినా సేఫ్! - Women Safety Gadgets

Women Safety Gadgets: మహిళలు కొన్ని సందర్బాల్లో ఒంటరిగా ప్రయాణించాల్సి వస్తుంటుంది. అలాంటి సమయంలో అనుకోకుండా అగంతకులు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయి. అయితే అలాంటి సందర్భాల్లో ఈ సేఫ్టీ గ్యాడ్జెట్స్ ఉంటే ఎక్కడికి వెళ్లినా సేఫ్​గా ఇంటికి తిరిగిరావచ్చు. అవేంటంటే?

Women_Safety_Gadgets
Women_Safety_Gadgets (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Sep 3, 2024, 4:36 PM IST

Updated : Sep 3, 2024, 4:53 PM IST

Women Safety Gadgets: మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో బయటకు వెళ్లాలంటేనే ఆడవారు భయపడిపోతున్నారు. అయితే అలాంటి సందర్భాల్లో మహిళలను కాపాడేందుకు ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని గ్యాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటితో ఎలాంటి ఆపద నుంచి అయినా ఇట్టే బయటపడొచ్చు. మరి ఏంటా ఉమెన్ సేఫ్టీ గ్యాడ్జెట్స్? అవి ఎలా పనిచేస్తాయి? వంటి వివరాలు మీకోసం.

Alarm Keychain:

  • మహిళలు, అమ్మాయిలు ఒంటరిగా నడిచే సమయంలో అగంతకులు దాడులకు పాల్పడిన సమయంలో ఈ అలారమ్ కీజైన్ ఉపయోగపడుతుంది.
  • అపరిచితులు మనల్ని వెంబడించి దాడికి పాల్పడిన క్రమంలో ముందుగా నోటిపైనే ఎటాక్ చేస్తుంటారు.
  • అలాంటి సమయంలో గట్టిగా అరిస్తే నోరు మూయటం లేదా నోట్లో క్లాత్స్​ కుక్కడం వంటివి చేస్తుంటారు.
  • అలాంటప్పుడు ఈ కీచైన్​ పై భాగంలో ఉండే కీని లాగేసి ముందున్న బటన్​ను రెండుసార్లు ప్రెస్ చేస్తే భీకర శబ్ధంతో అలారం మోగుతుంది.
  • అప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవారు అలెర్ట్​ అయ్యే అవకాశం ఉంటుంది.
  • ఒకవేళ ఆ సమయంలో ఎవరూ లేకుంటే ఈ కీచైన్ పక్క భాగంలో ఉండే బటన్‌ ప్రెస్​ చేస్తే ముందు భాగంలో ఉండే ఎల్‌ఈడీ లైట్‌ వెలుగుతుంది. దాన్ని ఎదుటి వ్యక్తి కళ్లలోకి ఫోకస్‌ చేసి ఆపద నుంచి బయటపడొచ్చు.
  • ఆ తర్వాత కీచైన్ ముందున్న బటన్‌ని అలాగే నొక్కి పట్టుకుంటే అలారం ఆగిపోతుంది.
  • ఇలా రెండు విధాలుగా ఉపయోగపడే ఈ గ్యాడ్జెట్​ను మనం బయటకు వెళ్లేముందు మన చేతి వేళ్లకు తొడగడం లేదంటే బ్యాగ్‌, మెడలో ట్యాగ్‌కు తగిలించుకుంటే ఆపద సమయంలో బయటపడేందుకు సహాయం చేస్తుంది.
    Alarm_Keychain (amazon)

Pepper Spray:

  • మహిళల ఆత్మ రక్షణకు పెప్పర్​ స్ప్రే బాటిల్స్​ చాలా బాగా ఉపయోగపడతాయి.
  • ఆపత్కాల సమయంలో దీన్ని అగంతకుల కళ్లల్లో స్ప్రే చేస్తే దురద, మంట పుట్టేలా చేస్తుంది.
  • ప్రమాద తీవ్రతను బట్టి వారి కళ్లల్లో ఇది ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు స్ప్రే చేసి ఎదుటి వ్యక్తిని కోల్కోకుండా చేయొచ్చు.
  • తద్వారా ఆపద నుంచి బయటపడొచ్చు.
  • బయటకు వెళ్లే సందర్భంలో దీన్ని మహిళలు, విద్యార్థులు వారి హ్యాండ్​ బ్యాగ్స్, బ్యాగ్స్​లో తమ వెంట తీసుకెళ్తే ఉత్తమం.​
    Pepper_Spray (amazon)

Finger Tip Rings:

  • ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆపద ఎదురైనప్పుడు ఏం చేయాలో తోచదు.
  • అలాంటప్పుడు మనకు అందుబాటులో ఉన్న గ్యాడ్జెట్స్‌ ఆపరేట్‌ చేసే వీలు కూడా ఉండకపోవచ్చు.
  • అయితే అలాంటి ఆపద సమయంలో ఈ ‘ఫింగర్‌ టిప్‌ రింగ్స్‌’ మనకు సహాయపడతాయి.
  • ఒకవేళ మీరు రాత్రి పూట ఒంటరిగా బయటికి వెళ్లాల్సి వస్తే ఈ రింగ్స్‌ను గోళ్లకు అమర్చుకోవడం వల్ల ఆపద సమయాల్లో సత్వరమే స్పందించచ్చు.
  • అగంతకులు దాడికి పాల్పడితే వారిపై వీటితో ప్రతిదాడి చేసి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
    Finger_Tip_Rings (amazon)

Stealodeal Key Chain:

  • ఆపత్కాల సమయంలో మహిళలకు ఈ కీచైన్ ఉపయోగపడుతుంది.
  • ఇందులో టార్చ్, స్క్రూడ్రైవర్, కత్తి, బాటిల్ ఓపెనర్ వంటి వివిధ రకాల టూల్స్ అమరి ఉంటాయి.
  • ఆపద ఎదురైనప్పుడు అగంతకులపై వీటితో దాడి చేసి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
  • ఇది చాలా లైట్​ వెయిట్​గా ఉండటంతో బయటకు వెళ్లేటప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు.
  • దీన్ని వేళ్లకు తొడగడం లేకుంటే బ్యాగ్‌, మెడలో ట్యాగ్‌కు తగిలించుకోవచ్చు.
    Stealodeal_Key_Chain (amazon)

Red Chilli Spray:

  • మహిళలు, అమ్మాయిలు బయటకు వెళ్లేటప్పుడు రెడ్​ చిల్లీ స్ప్రే బాటిల్​ను బ్యాగ్​లో వేసుకుని వారితో కూడా తీసుకుని వెళ్తే మంచిది.
  • రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో అగంతకులు దాడులకు పాల్పడితే వెంటనే దీన్ని కళ్లల్లో స్ప్రే చేస్తే వారికి విపరీతమైన మంట కలుగజేస్తుంది.
  • ప్రమాద తీవ్రతను బట్టి వారి కళ్లల్లో దీన్ని స్ప్రే చేసి ఆపద నుంచి బయటపడొచ్చు.

ఇలా హ్యాండ్‌-ఫ్రెండ్లీగా ఉండే ఈ గ్యాడ్జెట్స్ ఆపత్కాల సమయంలో మహిళల రక్షణ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి ఫ్లిప్​ కార్ట్, అమెజాన్ వంటి యాప్స్​లో అందుబాటులో ఉన్నాయి. వీటి నాణ్యత, రంగు, డిజైన్​ను బట్టి మార్కెట్లో వివిధ రకాల ధరల్లో లభిస్తున్నాయి. ఆపద సమయాల్లో ఇవి కొంత వరకు మనకు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి.

Red_Chilli_Spray (amazon)

అమ్మాయిలూ బయటికి వెళ్తున్నారా?- మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే ఎక్కడికెళ్లినా సేఫ్! - Women Safety APPs in India

ఈ-మెయిల్ పొరపాటున సెండ్ చేశారా?- డోంట్ వర్రీ.. ఇలా చేస్తే అన్​సెండ్​ చేసేయొచ్చు! - How to Unsend Email in Gmail

Last Updated : Sep 3, 2024, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details