ETV Bharat / entertainment

ప్రభాస్ Vs డాన్ లీ! - ఆ పోస్టర్​తో 'స్పిరిట్' విలన్ కన్ఫార్మ్ అయినట్లేనా! - PRABHAS SPIRIT MOVIE

ప్రభాస్​కు కొరియన్ యాక్టర్​ సపోర్ట్! - 'స్పిరిట్' విలన్ ఆయనేనా!

Prabhas Spirit Movie
Prabhas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2024, 7:16 AM IST

Prabhas Spirit Movie : రెబల్ స్టార్ ప్రభాస్ కాల్షీట్​ ప్రస్తుతం వరుస సినిమాల డేట్స్​తో నిండిపోయింది. ఇప్పటికే ఆయన 'రాజా సాబ్' షూటింగ్​లో బిజీగా ఉండగా, త్వరలోనే ఆయన మరిన్ని చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అందులో అభిమానులు అప్​డేట్ల కోసం తెగ వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది 'స్పిరిట్' అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా గతంలో నెట్టింట చాలా బజ్ క్రియేట్ చేసి తెగ ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా ఇందులో ఫారిన్​కు చెందిన స్టార్ నటిస్తున్నారన్న వార్త రెబల్ ఫ్యాన్స్​ను తెగ ఎగ్జైట్ అయ్యేలా చేసింది.

ఆయనెవరో కాదు కొరియన్ నటుడు డాన్ లీ. ఈయన 'స్పిరిట్​'లో విలన్‌గా నటిస్తున్నారంటూ గతంలో ఓ రూమర్​ ట్రెండ్ అవ్వగా, అభిమానులు కూడా ఆయన పోస్ట్​ల కింద ప్రభాస్​ పేరును అలాగే స్పిరిట్ గురించి కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. దీంతో అప్పట్లో ఈ విషయం కాస్త నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. కానీ అటు డాన్ లీ కానీ ఇటు మూవీ టీమ్ కానీ స్పందించికపోవడం వల్ల అందరూ దీన్ని రూమర్​గానే భావించి వదిలేశారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ కాంబోలో సినిమా రావడం ఖాయమని తెలుస్తోంది. ఎలాగంటే?

ఆ పోస్టర్​తో కన్ఫార్మ్ అయినట్లే!
ఇప్పటికే 'సలార్ 2'ను పట్టాలెక్కించే పనులు మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పోస్టర్​ను తన ఇన్​స్టా స్టోరీలో షేర్ చేశారు డాన్ లీ. అంతేకాకుండా ఆ చిత్రానికి ఆల్ ది బెస్ట్ అంటూ ఓ ఎమోజీ కూడా జోడించారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. ఇప్పటివరకూ ఎటువంటి రూమర్​కు స్పందించని ఆయన, ఇప్పుడు ఇలా పోస్ట్​ చేయడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. అయితే సలార్ పోస్టర్​ను షేర్ చేయడం వల్ల ఆ సినిమాలో డాన్ లీ నటిస్తున్నారా? లేకుంటే ప్రభాస్​కు సపోర్ట్ చేసేందుకు ఇలా చేశారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పోలీస్​ నుంచి మరో పాత్రకు!
మరోవైపు 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ పోలీస్​గానే కాకుండా మరో విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. మొదట్లో పోలీస్​గా ఉన్న ప్రభాస్, స్టోరీలోని ట్విస్ట్​ కారణంగా ఓ గ్యాంగ్​స్టర్​గా అవుతారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కానీ అభిమానులు మాత్రం ప్రభాస్ ఆ రోల్​ కూడా బాగా సూట్ అవుతారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

'స్పిరిట్' సాలిడ్ అప్డేట్​- మూవీ పనులు షురూ

అది ఫైనలైజ్ అవ్వగానే 'స్పిరిట్' షూటింగ్​ స్టార్ట్ : నిర్మాత భూషణ్​ కుమార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.