ICC Rating Pitch : ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత స్వదేశంలో టీమ్ఇండియా రెండు టెస్టు సిరీస్‌ల్లో ఆడింది. బంగ్లాదేశ్‌ను 2- 0 తేడాతో వైట్‌వాష్ చేసింది. తాజాగా కివీస్‌తో జరిగిన సిరీస్ లో 0- 3తేడాతో ఓడి చతికిలబడింది. ఈ ఐదు టెస్టులు జరిగిన పిచ్ రిపోర్ట్‌లను తాజాగా ఐసీసీ వెల్లడించింది. ఇందులో ఒక్క పిచ్‌కు మంచి రేటింగ్ రాగా, మరో నాలుగు పాస్ అయినట్లు తెలుస్తోంది.
ఆమైదానంపై అసంతృప్తి!
కాన్పూర్ టెస్టులో వర్షం కారణంగా రెండున్నర రోజులు ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. అయితే, ఆ మైదానం ఔట్ ఫీల్డ్ పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వర్షం తగ్గినా మ్యాచ్ కోసం సిద్ధం కావడానికి మరింత సమయం పట్టడం కూడా దానికి కారణమని తెలుస్తోంది. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చినట్లు సమాచారం. ఇక పిచ్ విషయానికొస్తే మాత్రం సంతృప్తికరంగానే ఉందని ఐసీసీ పేర్కొంది.
చెపాక్ సూపర్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు జరిగిన చెపాక్ స్టేడియం (చెన్నై) పిచ్ చాలా బాగుందని రిపోర్ట్‌లో ఐసీసీ ప్రకటించింది. న్యూజిలాండ్‌తో బెంగళూరు, పుణె, ముంబయి వేదికగా మూడు టెస్టులు జరిగాయి. అన్నింట్లోనూ భారత్ ఓటమి పాలైంది. ఈ పిచ్‌ల పరిస్థితిపై ఐసీసీ నివేదిక ఇచ్చి సంతృప్తి వ్యక్తం చేసింది.
అన్ని పిచ్‌లు అంతే
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్ టీమ్ఇండియా క్వీన్ స్వీప్ చేసింది. హైదరాబాద్, గ్వాలియర్, దిల్లీ వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరిగాయి. పొట్టి ఫార్మాట్‌కు సంబంధించి అన్ని పిచ్‌లు బాగున్నాయని ఐసీసీ ప్రకటించింది. మరోవైపు, కివీస్‌తో టెస్టు సిరీస్ కోసం వినియోగించిన పిచ్‌లపై ఐసీసీ సంతృప్తి వ్యక్తంచేసినా, టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ మాత్రం సంతోషంగా లేదట. టీమ్‌ఇండియాకు అనుకూలంగా ఫలితాలను అందించడంలో విఫలమైందన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు రోజుల్లో షెడ్యూల్
పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను మరో మూడు రోజుల్లో ఐసీసీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహింsచేందుకు పాక్ అంగీకరించినట్లు సమాచారం. దీంతో భారత్ ఆడే మ్యాచులను దుబాయ్ లేదా షార్జా వేదికగా నిర్వహించే అవకాశం ఉంది. టీమ్ ఇండియా లేకుండా టోర్నీ జరిగితే ఆదాయపరంగానూ ఇబ్బందులు తప్పవని పీసీబీ భావించిందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
న్యూజిలాండ్‌తో మూడో టెస్టు - పిచ్ విషయంలో టీమ్ ఇండియా కఠిన నిర్ణయం!
పిచ్ పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం వారిదే! - గ్రౌండ్‌ను మెయింటెన్ చేసే స్టాఫ్ శాలరీ ఎంతో తెలుసా?