iOS 18.2 Public Beta: టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ iOS 18.2 పబ్లిక్ బీటాను రిలీజ్ చేసింది. కంపెనీ ఇటీవల iOS 18.1ను విడుదల చేసింది. AI బేస్డ్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఈ అప్డేట్ను తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్‌తో 'ఐఫోన్ 15 ప్రో', 'ఐఫోన్ 16' స్మార్ట్‌ఫోన్లలో యాపిల్ ఫస్ట్ వేవ్ AI ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు యాపిల్ రెండో బ్యాచ్ AI ఫీచర్లు iOS 18.2లో అందుబాటులో ఉన్నాయి.
iOS 18.2 అప్‌డేట్ కంటే ముందు కంపెనీ పబ్లిక్ బీటాను రిలీజ్ చేసింది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ప్రస్తుతం US ఇంగ్లీషులో యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. iOS 18.2 అప్‌డేట్‌తో 'ఐఫోన్ 15 ప్రో', 'ఐఫోన్ 16' సిరీస్ వినియోగదారులు రెండో బ్యాచ్ యాపిల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లను పొందుతారు. ఇందులో జెన్‌మోజీ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు కస్టమ్ ఎమోజీని క్రియేట్ చేయగలరు. ఇమేజ్ ప్లేగ్రౌండ్ సహాయంతో యూజర్స్ కార్టూన్ లాంటి చిత్రాలను కూడా సృష్టించొచ్చు.
అంతేకాక ఈ iOS 18.2 అప్డేట్లోని నోట్స్ యాప్, ఇమేజ్ వాండ్ ఫీచర్ల సహాయంతో జస్ట్ రఫ్ స్కెచ్ నుంచి కంప్లీట్ ఇమేజ్ను క్రియేట్ చేయొచ్చు. ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు చాట్‌జీపీటీతో కనెక్ట్ అయి ఉంటాయి. యూజర్లు సంక్లిష్టమైన ప్రశ్న అడిగితే ఇది 'Use ChatGPT?' అనే ఆప్షన్‌ను ఇస్తుంది. అంటే వీటిని సిరి చాట్‌జీపీటీకి లింక్ చేస్తుంది.
యాపిల్ తీసుకొచ్చిన ఈ సెకండ్ బ్యాచ్ ఏఐ ఫీచర్లను రోల్ అవుట్‌కి ముందే పొందాలనుకుంటే మీ ఐఫోన్లో iOS 18.2 పబ్లిక్ బీటాను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం మీరు యాపిల్ బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ బీటాను ఇన్‌స్టాల్ చేసే ముందు మీరు ఇప్పటికే ఉన్న మీ iOS సెటప్‌ను బ్యాకప్ చేయాలి. వీలైతే పబ్లిక్ బీటాను మీ సెకండరీ డివైజ్‌లో మాత్రమే ఇన్‌స్టాల్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు బ్యాకప్ ఉంటే మీరు డేటాను కోల్పోకుండా iOS 18.1కి ఈజీగా తిరిగి వెళ్లగలగుతారు. అయితే మీరు యాపిల్ బీటా టెస్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లో చేరిన తర్వాతే మీ ఐఫోన్లో iOS 18.2 పబ్లిక్ బీటాను ఇన్‌స్టాల్ చేయగలరు.
iOS 18.2 పబ్లిక్ బీటాను ఇన్‌స్టాల్ చేయడం ఎలా?:
- ముందుగా మీరు మీ ఐఫోన్ సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.
- ఇప్పుడు స్క్రోలింగ్ చేస్తే కింద జనరల్ ఆప్షన్ కన్పిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి.
- ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ అప్డేట్పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు iOS 18.2 పబ్లిక్ బీటాను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసే ఆప్షన్ కన్పిస్తుంది.
- ఈ ఐఓఎస్ 18.2 స్టేబుల్ వెర్షన్‌లోని ఫీచర్లు వచ్చే నెలలోపు ఐఫోన్లలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ తాజా iOS వెర్షన్ అప్‌డేట్ అందుబాటులోకి రానున్న ఐఫోన్లు ఇవే!:
- iPhone 16
- iPhone 16 Plus
- iPhone 16 Pro
- iPhone 16 Pro Max
- iPhone 15
- iPhone 15 Plus
- iPhone 15 Pro
- iPhone 15 Pro Max
- iPhone 14
- iPhone 14 Plus
- iPhone 14 Pro
- iPhone 14 Pro Max
- iPhone 13
- iPhone 13 mini
- iPhone 13 Pro
- iPhone 13 Pro Max
- iPhone 12
- iPhone 12 mini
- iPhone 12 Pro
- iPhone 12 Pro Max
- iPhone 11
- iPhone 11 Pro
- iPhone 11 Pro Max
- iPhone XS
- iPhone XS Max
- iPhone XR
- iPhone SE
హైదరాబాద్‌లోనే ఉంటున్నారా?- నేటి నుంచి టెక్నాలజీ మేళా- సెలబ్రిటీలు కూడా వస్తున్నారంట!
ఇండియన్ మార్కెట్లోకి మొట్టమొదటి స్కోడా కారు- సెగ్మెంట్లోనే అతి తక్కువ ధరలో లాంచ్!