ETV Bharat / state

ఔరా..! ఊరు చూస్తే చిన్నది - ఊరి నిండా ప్రభుత్వ ఉద్యోగులే! - GOVT JOBS VILLAGE STORY

ప్రత్యేకత చాటుకుంటున్న నేరడిగొండ మండలంలోని చిన్న బుగ్గారం - రెవెన్యూ, పోలీసు, విద్య, వైద్యం ఇలా పలు రంగాల్లో ప్రభుత్వ కొలువులు సాధించిన చిన్న బుగ్గారం అభ్యర్థులు

Government Jobs Achieved
Government Jobs Achieved Students of Adilabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2024, 8:02 AM IST

Government Jobs Achieved Students of Adilabad : అదో మారుమూలన ఉండే చిన్న పల్లె. బాహ్యప్రపంచానికి అంతగా తెలియని గిరిజన తండా. అక్కడేం ఉంటుందనుకుంటే పొరపాటే. తరచిచూస్తే చదువులమ్మకు నమస్కరించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తోంది. భూతల్లికి ప్రణమిళ్లి వ్యవసాయంలోనూ ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నికల సమయంలోనే రాజకీయాలంటూ ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్‌ జిల్లాలోని చిన్నబుగ్గారం పల్లె గురించి తెలుసుకుందాం.

ప్రత్యేకత చాటుకుంటున్న చిన్న బుగ్గారం : ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలోని చిన్న బుగ్గారం చిన్న పల్లె. మూడు దశాబ్దాల కిందట వ్యవసాయం తప్పితే మరో ధ్యాసే లేని సాధారణ గ్రామం. ప్రస్తుతం జనాభా 580 వరకు ఉంటే 409 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఓ అంగన్వాడీ కేంద్రం, ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఉంది. పాతికేళ్ల కిందట బడికి వెళ్లాలంటే పక్క గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చేరాల్సిందే. అది చిన్నబుగ్గారం గతం.

ప్రభుత్వ ఉద్యోగాలు : గతంలో గ్రామానికి చెందిన ప్రతాప్‌సింగ్‌, శ్రావణ్‌కుమార్‌ అప్పటి జిల్లా సెలెక్షన్‌ కమిటీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక కావటం పల్లెని ఓ మలుపుతిప్పింది. వారిని ప్రేరణగా తీసుకున్న తల్లిదండ్రులు పిల్లలను చదివించటంతో ప్రయోజకులను చేశారు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారి సంఖ్య అక్షరాలా 82 మంది అంటే నమ్మితీరాల్సిందే. రెవెన్యూ, పోలీసు, విద్య, వైద్యం వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు చిన్నబుగ్గారం వేదికగా నిలుస్తోంది.

మేఘాలయ రాష్ట్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేసే ఇందల్‌కుమార్‌ హైదరాబాద్‌లోని నేషనల్‌ జియోగ్రాఫికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో పనిచేసే భూగర్భ నిపుణులు డాక్టర్‌ లోహిత్‌కుమార్‌ ఆదిలాబాద్‌ రిమ్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ జైసింగ్‌ బుగ్గారం గ్రామస్థులే. ఏడాది కిందట ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లలో పరీక్ష రాసి ఇటీవల 6 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన నిఖిత ఈ గ్రామానికి చెందిన యువతే.

వ్యవసాయంలోనూ చిన్నబుగ్గారం ఆదర్శంగా నిలుస్తోంది. చదువంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు అన్నిరంగాల్లోనూ ఎదగవచ్చని అంటారు వ్యవసాయం చేస్తున్న ఎంఏ. బీఈడీ చేసిన పట్టభద్రులు. రాజకీయాలంటే ఎన్నికలప్పుడు మినహా మిగిలిన సమయాల్లో అందరూ ఐక్యతతో ఉండటంలో చిన్నబుగ్గారం ప్రత్యేకతను చాటుకుంటోంది. ఉద్యోగులు చేస్తున్నవారే కాదు. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ విద్యనభ్యసిస్తున్నవారు ఐదుగురు, పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులు ముగ్గురు గ్రామానికి చెందిన వారు ఉన్నారు. దీంతో ఇతర గ్రామాలకు చిన్నబుగ్గారం ఆదర్శంగా నిలుస్తోంది.

YUVA : సేంద్రీయ వ్యవసాయం దిశగా అడుగులు - యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్న నల్గొండ యువ రైతు - Organic Farming in Nalgonda

YUVA: నాటుకోళ్లతో రూ.కోట్ల సంపాదన​ - ఈ యంగ్ టెకీ బిజినెస్ ఐడియా అదుర్స్ - COUNTRY CHICKEN CO IN HYDERABAD

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.