ETV Bharat / technology

ఇండియన్ మార్కెట్లోకి మొట్టమొదటి స్కోడా కారు- సెగ్మెంట్​లోనే అతి తక్కువ ధరలో లాంచ్! - SKODA KYLAQ GLOBAL DEBUT

మార్కెట్లోకి స్కోడా కైలాక్- ధర, ఫీచర్లు ఇవే..!

Skoda Kylaq
Skoda Kylaq (Skoda Auto)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 8, 2024, 1:02 PM IST

Skoda Kylaq Global Debut: స్కోడా ఆటో ఇండియా సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ ఈ విభాగంలో తన మొదటి కారు 'స్కోడా కైలాక్'​ను భారత మార్కెట్​కు పరిచయం చేసింది. దీని బుకింగ్స్ డిసెంబర్ 2, 2024 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఎస్​యూవీని కంపెనీ జనవరి 17, 2025న జరిగే భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఆవిష్కరించనుంది. దీని డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

స్కోడా కైలాక్ డిజైన్: కైలాక్ భారతదేశంలో మొట్టమొదటి స్కోడా కారు. ఈ కారును కొత్త మోడ్రన్ సాలిడ్ డిజైన్​తో తీసుకొచ్చారు. దీని ముందు భాగంలో బటర్‌ఫ్లై గ్రిల్ ఉంది. ఇది స్లిమ్ LED DRLలతో చుట్టి ఉంటుంది. దీనిలో మెయిన్ హెడ్‌ల్యాంప్‌లు కిందికి ఉన్నాయి. దీని బంపర్ సెంటర్ ప్రామినెంట్ ఎయిర్ వెంట్, దిగువన ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో వస్తుంది.

ఈ కారు టాప్ మోడల్​లో డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని వెనుక డిజైన్ స్కోడా నుంచి వచ్చిన పాపులర్ ఎస్​యూవీ కుషాక్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది బ్లాక్ ట్రిమ్ స్ట్రిప్​తో అటాచ్ చేసిన ప్లెయిన్ లుక్​లో టెయిల్​ల్యాంప్స్​ను కలిగి ఉంది. దీని వెనక బంపర్ చాలా క్లాడింగ్, మెయిన్ స్కిడ్ ప్లేట్​ ఎలిమెంట్​తో వస్తుంది.

స్కోడా కైలాక్ ఇంటీరియర్: దీని క్యాబిన్ డిజైన్ కుషాక్‌ ఎస్​యూవీను పోలి ఉంటుంది. దీని టాప్ మోడల్‌లో 10-అంగుళాల సెంటర్ టచ్‌స్క్రీన్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, నిలువుగా ఓరియెంటెడ్ సైడ్ వెంట్స్​ ఉన్నాయి. ఇది స్కోడా స్లావియా, కుషాక్ ఇంటీరియర్​ను పోలి ఉంటుంది.

ఇతర ఫీచర్లు:

  • పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు
  • సన్‌రూఫ్
  • వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
  • వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్
  • డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

స్కోడా కైలాక్ షేప్: స్కోడా కైలాక్ 3,995 mm పొడవు, 1,783 mm వెడల్పు, 1,619 mm ఎత్తుతో 2,566 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ SUV గ్రౌండ్ క్లియరెన్స్ 189 mm, బూట్ స్పేస్ 446 లీటర్లు అని కంపెనీ తెలిపింది.

స్కోడా కైలాక్ పవర్‌ట్రెయిన్: ఈ కొత్త కారు VW గ్రూప్ 1.0-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఇంజిన్ 114 బిహెచ్‌పి పవర్, 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అయితే ఈ ఎస్​యూవీ .0-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్​బాక్స్ ఆప్షన్లలో మాత్రమే ఉంటుంది.

మార్కెట్లో పోటీ: ఇండియన్ మార్కెట్లో ఈ స్కోడా కైలాక్.. మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుంది.

ధర: ఇండియన్ మార్కెట్లో ఈ కారు ధర రూ. 7.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం- వారికి సోషల్ మీడియా నిషేధం!

పెరుగుతున్న స్మార్ట్​ఫోన్ల ధరలు- అసలు తయారీకి కంపెనీలు ఎంత ఖర్చుపెడుతున్నాయో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.