POCO New 5G Phones:ఇండియన్ మార్కెట్లోకి పోకో నుంచి పవర్ ఫుల్ 5G స్మార్ట్ఫోన్లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అది కూడా ప్రీమియం ఫీచర్లతో అత్యంత చౌక ధరలో రానున్నట్లు తెలుస్తోంది. 'POCO C75 5G', 'POCO M7 Pro 5G' పేర్లతో వీటిని ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నారు. వీటి రిలీజ్‌పై పోకో సీఈవో హిమాన్షు టాండన్ 'X' లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వీటి రిలీజ్, ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
పోకో 5G మొబైల్స్ రిలీజ్ ఎప్పుడు?: పోకో సీఈవో హిమాన్షు టాండన్ 'X' లో పోస్ట్ ద్వారా ఈ సరికొత్త స్మార్ట్ఫోన్ల లాంఛింగ్ తేదీని ప్రకటించారు. ఆయన చేసిన పోస్ట్ ప్రకారం ఈ అప్‌కమింగ్ మొబైల్స్ డిసెంబర్ 17, 2024న రిలీజ్ కానున్నాయి.
ప్రీమియం ఫీచర్లు:'పోకో C75 5G', 'POCO M7 Pro 5G' మొబైల్స్‌పై స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ను రివీల్ చేయలేదు. ఆయన పోస్ట్‌లో కేవలం 'POCO M7 Pro 5G' స్మార్ట్‌ఫోన్ లాంఛ్ డేట్‌ను మాత్రమే రివీల్ చేశారు. అయితే నివేదికల ప్రకారం.. కంపెనీ ఈ 5G మొబైల్స్‌ను బడ్జెట్- ఫ్రెండ్లీగా అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోకో C-సిరీస్ దాని సరసమైన ధరకు ప్రసిద్ధి చెందడంతో కంపెనీ ఈ అప్‌కమింగ్ మొబైల్స్‌ను కూడా బడ్జెట్- ఫ్రెండ్లీగా తీసుకురావాలని చూస్తోంది.
ఈ రెండింటిలో 'POCO M7 Pro 5G' మొబైల్ మరిన్ని ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో రానుంది. దీంతో ఎక్కువ ప్రీమియం ఫీచర్లు ఉన్న మొబైల్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్. 5G కనెక్టివిటీతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ ఈ రెండు ఫోన్‌లను తీసుకొస్తోంది.
గతేడాది డిసెంబర్‌లో 'POCO C65' స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయింది. దీంతో ఈ అప్‌కమింగ్ 'C75 5G' ఫోన్‌ను C-సిరీస్‌లో చేర్చనున్నారని అంతా భావిస్తున్నారు. అదేవిధంగా 'POCO M6 Pro 5G' స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో రిలీజ్ చేశారు.