Oppo Find X8 Ultra:కిర్రాక్ ఫీచర్లతో 'ఒప్పో ఫైండ్ X8' సిరీస్ ఇటీవలే దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‌లో ఒప్పో 'ఫైండ్ X8', 'ఫైండ్ X8 ప్రో' అనే రెండు మోడల్స్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో కంపెనీ ఇప్పుడు చైనాలో మరింత ప్రీమియం 'ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా' మోడల్‌ను లాంఛ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ఫోన్ కెమెరా సెటప్‌పై చాలానే లీక్స్ వచ్చాయి. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ టాప్-ఎండ్ డిస్ప్లేతో వస్తుందని లీక్ వచ్చింది. ఇది 'ఒప్పో ఫైండ్ X7 అల్ట్రా' సక్సెసర్. ఇప్పుడు ఈ అప్‌కమింగ్ ఒప్పో ఫోన్ ఫ్లాట్ ప్యానెల్‌తో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Weiboలోని Tipster డిజిటల్ చాట్ స్టేషన్ ఈ 'ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా' కర్వ్డ్ (వంపుతిరిగిన) డిస్ప్లేకు బదులుగా బెజెల్స్‌తో ఫ్లాట్-స్క్రీన్‌ను కలిగి ఉంటుందని పేర్కొంది. కంపెనీ ఈ ఫోన్ బెజెల్ సైజ్‌ను తగ్గించేందుకు LIPO (లో-ఇంజెక్షన్ ప్రెజర్ ఓవర్‌మోల్డింగ్) ప్యాకేజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో కర్వ్డ్ స్క్రీన్‌లు ఉండటం పాత ట్రెండ్‌గా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో 2025లో ఫ్లాట్-స్క్రీన్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్ 'ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా' మోడలే కావచ్చని టిప్‌స్టర్ పేర్కొన్నారు.
ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా అంచనా స్పెసిఫికేషన్లు:ఒప్పో 'ఫైండ్ X8 అల్ట్రా' ఈ మార్చిలో 'ఫైండ్ X8 మిని'తో పాటు అధికారికంగా రిలీజ్ కావచ్చని పుకారు షికారు చేస్తోంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC ప్రాసెసర్‌తో వస్తుందని అంచనా. ఈ ఫోన్ 6.82-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుందని, అథెంటికేషన్ కోసం ఇది ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుందని సమాచారం. వీటితో పాటు ఈ ఫోన్ హాసెల్‌బ్లాడ్-బ్యాక్డ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
కెమెరా సెటప్ (అంచనా):ఒప్పో 'ఫైండ్ X8 అల్ట్రా'లో 50-మెగాపిక్సెల్ 1-అంగుళం Sony Lytia LYT-900 సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ Sony Lytia LYT-701 టెలిఫోటో సెన్సార్, 6x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో పాటు 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉండొచ్చు.