Oneplus 13 vs IQOO 13 Comparison: వన్‌ప్లస్ తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 13 మోడల్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. కొన్ని వారాల క్రితం దీన్ని చైనాలో రిలీజ్ చేసిన తర్వాత కంపెనీ దీని డిస్‌ప్లే డిజైన్‌ను ఛేంజ్ చేసి ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. లేటెస్ట్ ప్రాసెసర్, హై ఎండ్ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి కిర్రాక్ ఫీచర్లతో దీన్ని రిలీజ్ చేసింది.
వన్‌ప్లస్ ఈ కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ భారత మార్కెట్లో వివో సబ్-బ్రాండ్ ఐక్యూ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఐకూ 13తో పోటీ పడబోతోంది. ఐకూ కొన్ని నెలల క్రితమే ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో రిలీజ్ చేసింది. అయితే ఈ రెండింటిలో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్? ఎందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి? ఏది వాల్యూ ఫర్ మనీ వంటి వివరాలు తెలుసుకునేందుకు ఈ రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల కంపారిజన్ మీకోసం.
1. డిజైన్ కంపారిజన్:
OnePlus 13 డిజైన్:
- బిల్డ్ క్వాలిటీ:వన్‌ప్లస్ 13లో అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ వంటి ప్రీమియం మెటీరియల్స్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్ చాలా ప్రీమియం అండ్ సాలిడ్ అనుభూతిని అందిస్తుంది.
- ఫ్రంట్ డిజైన్:ఫోన్ ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని కారణంగా ఫోన్ బెజెల్స్ చాలా సన్నగా ఉంటాయి. స్క్రీన్-టు-బాడీ రేషియో ఎక్కువగా ఉంటుంది.
- వెనక డిజైన్: ఈ స్మార్ట్‌ఫోన్ వెనక వైపు కెమెరా మాడ్యూల్ ఉంది. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. దీని కెమెరా మాడ్యూల్ డిజైన్ మోడ్రన్‌గా ఆకర్షణీయంగా ఉంటుంది.
- కలర్ ఆప్షన్స్: వన్‌ప్లస్ 13 మొబైల్ రెడ్, గెలాక్సీ బ్లూ, క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.
IQOO 13 డిజైన్:
- బిల్డ్ క్వాలిటీ: iQOO 13లో కూడా ప్రీమియం మెటీరియల్స్ ఉపయోగించారు. అయితే దీనికి కార్బన్ ఫైబర్ బ్యాక్ అందించారు. దీని కారణంగా ఈ ఫోన్ లైట్ వెయిట్‌తో స్ట్రాంగ్‌గా ఉంటుంది.
- ఫ్రంట్ డిజైన్: iQOO 13 కూడా ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కానీ దాని బెజెల్స్ కొంచెం మందంగా ఉంటాయి. దీని కారణంగా స్క్రీన్-టు-బాడీ రేషియో వన్‌ప్లస్ 13 కంటే కొంచెం తక్కువగా ఉంటుంది.
- వెనక డిజైన్: ఈ ఫోన్ వెనుక వైపు కెమెరా మాడ్యూల్ ఉంది. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీని కెమెరా మాడ్యూల్ డిజైన్ కొంచెం పెద్దగా బాక్సీగా ఉంటుంది.
- కలర్ ఆప్షన్స్: iQOO 13 స్టీల్త్ బ్లాక్, ఫైర్ ఆరెంజ్, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
2. డిస్‌ప్లే కంపారిజన్:
- OnePlus 13 డిస్‌ప్లే: ఇందులో 6.82-అంగుళాల QHD+ (3168 x 1440 పిక్సెల్స్) 120Hz 3D AMOLED LTPO డిస్‌ప్లే ఉంటుంది. ఇది 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే స్క్రీన్-టు-బాడీ రేషియో 93.5%. ఇది HDR కంటెంట్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే డాల్బీ విజన్‌కు సపోర్ట్ చేస్తుంది.
- iQOO 13 డిస్‌ప్లే: 6.82- అంగుళాల QHD+ (3168 x 1440 పిక్సెల్స్) 144Hz LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే స్క్రీన్-టు-బాడీ రేషియో 93.87%. ఇది HDR10+కి సపోర్ట్ చేస్తుంది. ఇది HDR కంటెంట్ డీప్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
ఈ రెండు స్మార్ట్ఫోన్ల డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతమైనది. అయితే స్మూత్ రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్ ఆధారంగా మీ ప్రాధాన్యతను బట్టి మీకు ఏది సరైనదో ఎంచుకోవాలి.
3. ప్రాసెసర్ కంపారిజన్:
OnePlus 13:
- ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్
- CPU:Qualcomm Oryon CPU @ 4.32GHz
- GPU:అడ్రినో 830
- ప్రాసెస్ టెక్నాలజీ: 3nm ప్రాసెస్ టెక్నాలజీ
- పవర్ కన్సెప్షన్: ఎనర్జీ ఎఫిసియెంట్. ఇది ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
iQOO 13:
- ప్రాసెసర్ (చిప్): క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్
- CPU: ఆక్టా-కోర్ (2x3.32 GHz కార్టెక్స్-X3 + 6x2.42 GHz కార్టెక్స్-A715)
- GPU:అడ్రినో 750
- ప్రాసెస్ టెక్నాలజీ: 3nm ప్రాసెస్ టెక్నాలజీ
- పవర్ కన్సెప్షన్:పవర్- ఎఫిసియెంట్ డిజైన్. ఇది మెరుగైన బ్యాటరీ పనితీరును అందిస్తుంది.
ఈ రెండు స్మార్ట్ఫోన్లూ క్వాల్కామ్ లేటెస్ట్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌లను కలిగి ఉన్నాయి.
4. బ్యాక్ కెమెరా సెటప్ కంపారిజన్:
OnePlus 13 బ్యాక్ కెమెరా సెటప్:కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ వెనక ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇచ్చింది. ఇందులో మెయిన్ కెమెరా 50MP Sony LYT-808 సెన్సార్‌తో వస్తుంది. ఈ సెన్సార్ OIS, EIS, ఆటోఫోకస్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ సెకండ్ బ్యాక్ కెమెరా 50MP Sony LYT-600 టెలిఫోటో సెన్సార్‌తో వస్తుంది. ఇందులో 3X ఆప్టికల్ జూమ్ సపోర్ట్ ఫీచర్ కూడా ఉంది. ఈ సెన్సార్ OIS, EIS, ఆటో ఫోకస్ సపోర్ట్‌తో కూడా వస్తుంది. ఇది 120x వరకు అల్ట్రా జూమ్ కూడా చేయగలదు. ఫోన్ థర్డ్ బ్యాక్ కెమెరా కూడా 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది.
వీటితో పాటు ఫోన్ వెనక భాగంలో LED ఫ్లాష్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 30fps వద్ద 8K వీడియో రికార్డింగ్, 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4K వీడియో రికార్డింగ్ సమయంలో కూడా జూమ్ చేయొచ్చు. అంతేకాకుండా పోర్ట్రెయిట్, నైట్‌స్కేప్, మాస్టర్, హై పిక్సెల్, స్లోమోషన్, టైమ్‌ల్యాప్స్, మల్టీస్సీన్ వీడియో వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఫోన్ వెనక కెమెరా సెన్సార్‌లలో అందించారు.
iQOO 13 బ్యాక్ కెమెరా సెటప్: iQOO 13లో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రైమరీ కెమెరా 50MP సోనీ IMX921 సెన్సార్‌తో వస్తుంది. రెండో కెమెరా కూడా 50MP Samsung S5KJN1SQ03 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. ఇక దీని మూడో రియర్ కెమెరా 50MP సోనీ IMX 816 టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఇది 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో వస్తుంది.
ఈ ఫోన్ బ్యాక్ కెమెరా కూడా 30fps వద్ద 8K రిజల్యూషన్ వరకు వీడియోలను రికార్డ్ చేయగలదు. దీని వెనుక కెమెరా పోర్ట్రెయిట్, నైట్ మోడ్, స్లో మోషన్, టైమ్ లాప్స్, ప్రో, సూపర్‌మూన్ అల్ట్రా HD డాక్యుమెంట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది.
5. ఫ్రంట్ కెమెరా సెటప్ కంపారిజన్:
- OnePlus 13 ఫ్రంట్ కెమెరా సెటప్: OnePlus 13 స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP Sony IMX615ని కలిగి ఉంది. ఇది ఫిక్స్డ్ ఫోకస్ అండ్ EIS సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరా 60fps వద్ద 4K వీడియోను రికార్డ్ చేయగలదు. ఇది డాల్బీ విజన్‌లో 60 fps/30 fps వద్ద 4K వీడియోను రికార్డ్ చేయగలదు. ఈ ఫోన్ముందు కెమెరా ఫోటో, వీడియో, పోర్ట్రెయిట్, నైట్ సీన్, లైమ్-లాప్స్ ఫోటోగ్రఫీ, మల్టీ-సీన్ వీడియో రికార్డింగ్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది.
- iQOO 13 ఫ్రంట్ కెమెరా సెటప్: iQOO 13 స్మార్ట్‌ఫోన్ కూడా సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీని ఎపర్చరు f/2.45. ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరాతో 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. ఇది HDR సపోర్ట్‌తో వస్తుంది.
6. బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కంపారిజన్:
- OnePlus 13:ఈ ఫోన్ 6,000 mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్లో 50W AIRVOOC అంటే వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
- iQOO 13:ఇందులో కూడా వినియోగదారులు 6000mAh పెద్ద బ్యాటరీని పొందుతారు. అయితే ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ OnePlus 13 కంటే ఎక్కువ. ఇందులో యూజర్లు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను పొందుతారు. అయితే ఇది వన్‌ప్లస్ 13 వంటి వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయదు.
7. సాఫ్ట్వేర్ అండ్ ఏఐ ఫీచర్ల కంపారిజన్:
- OnePlus 13: OnePlus 13 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OxygenOS 15.0 పై రన్ అవుతుంది. ఇంటెలిజెంట్ సెర్చ్, గూగుల్ జెమిని, ఏఐ డిటెయిల్ బూస్ట్, ఏఐ అన్‌బ్లర్, ఏఐ రిఫ్లెక్షన్ ఎరేజర్, ఏఐ నోట్స్ వంటి అనేక ప్రత్యేక ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
- iQOO 13:ఈ ఫోన్ Android 15 ఆధారిత ఫన్‌టచ్ OS 15 పై రన్ అవుతుంది. AI ఎరేస్, AI ఫోటో ఎన్‌హాన్స్, సూపర్ డాక్యుమెంట్స్, లైవ్ కటౌట్, జెమిని అసిస్టెంట్, సర్కిల్ టు సెర్చ్, ట్రాన్స్‌లేషన్ ఆన్ గూగుల్ లెన్స్ సైడ్‌బార్ వంటి అనేక AI ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
8. కనెక్టివిటీ అండ్ ఇతర ఫీచర్ల కంపారిజన్:
- OnePlus 13: ఇందులో 5G కనెక్టివిటీ, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, డ్యూయల్ నానో సిమ్ స్లాట్, టైప్-C ఇయర్‌ఫోన్ సపోర్ట్, USB టైప్ C సపోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్, OReality ఆడియో, కలర్ టెంపరేచర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ లెన్స్, లేజర్ ఫోకస్ సెన్సార్‌తో సహా అనేక స్పెషల్ ఫీచర్లు అందించారు. ఈ ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్‌లతో వస్తుంది. ఇది వాటర్, డస్ట్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు ప్రొటెక్షన్ అందిస్తుంది.
- iQOO 13:ఈ ఫోన్లో 5G కనెక్టివిటీ, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, OTG, డ్యూయల్ నానో సిమ్ స్లాట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ కూడా IP68 అండ్ IP69 రేటింగ్‌లతో వస్తుంది. అంటే ఐకూ కూడా ఈ ఫోన్‌ను వాటర్, డస్ట్ నుంచి రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేసింది.
9. ఈ రెండు స్మార్ట్ఫోన్ల ధరల కంపారిజన్:
- OnePlus 13:ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 69,999 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో వినియోగదారులు 12GB RAM అండ్ 256GB వేరియంట్‌ను పొందుతారు. అంతేకాకా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేయడం ద్వారా ఈ ఫోన్‌పై రూ. 5000 తగ్గింపును పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ.64,999 ధరకే కొనుగోలు చేయొచ్చు. ఇది మాత్రమే కాకుండా కంపెనీ ఈ ఫోన్‌పై మరిన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది.
- iQOO 13: దీని ధర మార్కెట్లో రూ. 54,999 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో మీరు 12GB RAM అండ్ 256GB స్టోరేజ్‌ను పొందుతారు. మీరు ఈ ఫోన్‌ను ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చెల్లింపుపై రూ. 2000 ఇన్స్టంట్ డిస్కొంట్ను పొందొచ్చు. దీనితోపాటు ఈ ఫోన్‌పై 9 నెలల వరకు నో కాస్ట్ EMI సహా అనేక ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ వైట్, గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 మోడల్స్- పిచ్చెక్కించే డిజైన్లతో బైక్స్‌ను దింపుతున్న డుకాటి!
ఎంజీ విండ్సార్ ఈవీ ధరల పెంపు- ఫ్రీ ఛార్జింగ్ ఫెసిలిటీకి కూడా గుడ్‌బై
50MP కెమెరా, ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌తో మోటో జీ05- కేవలం రూ.6,999లకే!