Oben Rorr EZ Electric Motorcycle:దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల్లో ఒకటైన ఒబెన్ ఎలక్ట్రిక్ ఎట్టకేలకూ తన కొత్త 'ఒబెన్ రోర్ EZ' టీజర్‌ను రిలీజ్ చేసింది. టీజర్లో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రిలీజ్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించింది. ఈ బైక్‌ను డైలీ కంమ్యూటర్ సెగ్మెంట్లో ఈ ఏడాది నవంబర్ 7వ తేదీన రిలీజ్ చేయనుంది. ఈ విభాగంలో ఇది ఒక విప్లవం తీసుకురాగలదని కంపెనీ పేర్కొంది.
ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రస్తుత పరిస్థితులను ఛాలేంజ్ చేస్తుందని, ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త ఆవిష్కరణ, ఎక్సైట్మెంట్ను తీసుకురాబోతుందని తెలిపింది. కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. అయితే బైకర్స్ ఎదుర్కొనే సాధారణ సమస్యలను పరిష్కరించేలా ఈ బైక్ డిజైన్, పెర్ఫార్మెన్స్, కంఫర్ట్, ఫీచర్లు ఉంటాయని అంతా భావిస్తున్నారు. కంపెనీ ఈ ఒబెన్ రోర్ EZ ఎలక్ట్రిక్ బైక్‌తో రోజువారీ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ బైక్ అత్యాధునికమైన పేటెంట్ పొందిన హై-పెర్ఫార్మెన్స్ గల LFP బ్యాటరీ సాంకేతికతతో వస్తుంది. ఇది ఎక్సెప్షినల్ హీట్ రెసిస్టెన్స్, లాంగ్ లైఫ్‌తో మన దేశంలోని వాతావరణ మార్పులకు తగినట్లుగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఓబెన్ ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ టూ-వీలర్స్‌లో ఈ LFP కెమిస్ట్రీ బ్యాటరీలను ఉపయోగించడం ప్రారంభించింది. ఇది అత్యున్నత సేఫ్టీ స్టాండర్డ్స్‌తో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.