Upcoming Ducati Bikes: ఇటాలియన్ టూ-వీలర్ తయారీ సంస్థ డుకాటి నుంచి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బైక్స్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. కంపెనీ తన కొత్త ఉత్పత్తులతో ఈసారి మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ ఏడాది భారత్‌లో ఏకంగా 14 మోటార్‌సైకిళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త మోడల్స్‌ను ఆవిష్కరించింది. వీటి లాంఛ్ టైమ్‌లైన్‌ను కూడా రివీల్ చేసింది. ఇందులో సరికొత్త ఉత్పత్తులు, ప్రత్యేక ఎడిషన్ మోడల్స్‌తో పాటు ఇప్పటికే ఉన్న బైక్‌ల అప్‌డేట్ వెర్షన్‌లు ఉన్నాయి. వీటితో పాటు ప్రధాన నగరాల్లో మరిన్ని స్టోర్లను తెరవడం ద్వారా భారతదేశంలో తన డీలర్‌షిప్ పరిధిని విస్తరించడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
కంపెనీ అప్‌కమింగ్ మోటార్‌సైకిల్స్ లిస్ట్‌లో అప్‌డేటెడ్ V2 రేంజ్లో పానిగేల్ V4 7 జనరేషన్, డుకాటి DesertX డిస్కవరీ, పనిగేల్, స్ట్రీట్‌ఫైటర్, మల్టీస్ట్రాడా V2 ఉన్నాయి. వీటితో పాటు మూడో తరం స్ట్రీట్‌ఫైటర్ V4, స్క్రాంబ్లర్ డార్క్ 2nd జనరేషన్ కూడా ఈ ఏడాది మార్కెట్లో లాంఛ్ కానున్నాయి. అంతేకాక డుకాటి డయావెల్, పనిగేల్ V2 ఫైనల్ ఎడిషన్, పనిగేల్ V4 ట్రైకలర్ ఇటాలియా, పనిగేల్ V4 ట్రైకలర్, స్క్రాంబ్లర్ రిజోమా కూడా విడుదల కానున్నాయి.
2025లో విడుదల కానున్న డుకాటి బైక్స్ టైమ్‌లైన్:
Panigale V4 7th Generation: జనవరి-మార్చి మధ్యలో
Ducati DesertX Discovery: జనవరి-మార్చి మధ్యలో
Panigale V2 Final Edition: ఏప్రిల్-జూన్ మధ్యలో
Scrambler 2G Dark: ఏప్రిల్-జూన్ మధ్యలో
Multistrada V2: జులై-సెప్టెంబర్ మధ్యలో
Scrambler Rizoma: జులై-సెప్టెంబర్ మధ్యలో
Streetfighter V4 3rd Generation: జులై-సెప్టెంబర్ మధ్యలో
Streetfighter V2: జులై-సెప్టెంబర్ మధ్యలో
Panigale V2: జులై-సెప్టెంబర్ మధ్యలో
బుకింగ్స్: డుకాటి బైక్‌లపై ఆసక్తి ఉన్నవారు కొచ్చి, హైదరాబాద్, దిల్లీ, ముంబయి, పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, చండీగఢ్, అహ్మదాబాద్‌లోని డీలర్‌షిప్‌ల ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు.
కంపెనీ ఏం అంటోందంటే?: ఈ ఏడాది భారత్‌లో కొత్త బైక్‌లను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. మాన్స్టర్ 30 వార్షికోత్సవ ఎడిషన్లలో వాటిలో ఒకదాన్ని డుకాటి ప్రారంభించవచ్చని అంచనా. అయితే ఏ మోడల్ అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ 2025 నాటికి 14 మోటార్‌సైకిళ్లను విడుదల చేయడంతో పాటు, డుకాటి తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించాలని కూడా యోచిస్తోంది. భారతదేశంలో ప్రారంభించబోయే మోటార్‌సైకిళ్లలో అప్‌డేటెడ్ స్ట్రీట్‌ఫైటర్ V2, చాలా కాలంగా ఎదురుచూస్తున్న EICMA 2024లో ఆవిష్కరించిన పానిగేల్ V2 కూడా ఉన్నాయి.
ఎంజీ విండ్సార్ ఈవీ ధరల పెంపు- ఫ్రీ ఛార్జింగ్ ఫెసిలిటీకి కూడా గుడ్‌బై
అంతరిక్షంలో అంకురోత్పత్తి- ఆకులు తొడిగిన అలసంద- సత్తా చాటిన ఇస్రో