Oneplus 13 Launched with 5.5G Network: వన్‌ప్లస్ జనవరి 7న తన ఫ్లాగ్షిప్ లైనప్ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఇండియన్ మార్కెట్లో ప్రారంభించింది. ఈ సిరీస్‌లో కంపెనీ వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R పేర్లతో రెండు స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండింటిలో ఏఐ ఫీచర్లు, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్, కొత్త Silicon NanoStack బ్యాటరీ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
వీటన్నింటితో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వన్‌ప్లస్ 13లో మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇది ఇండియాలో జియో సహకారంతో 5.5G (అడ్వాన్స్‌డ్ 5G) నెట్‌వర్క్ సౌకర్యాన్ని అందిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలో ఈ నెట్‌వర్క్‌తో వస్తున్న మొట్ట మొదటి డివైజ్‌గా అవతరించింది.
ఈ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా వన్‌ప్లస్ సీనియర్ గ్లోబల్ PR మేనేజర్ జేమ్స్ ప్యాటర్సన్ ఈ లేటెస్ట్ 5.5G టెక్నాలజీపై మాట్లాడారు. ఈ అధునాతన నెట్‌వర్క్ వన్‌ప్లస్ 13 సిరీస్ డివైజ్‌లను ఒకేసారి మూడు వేర్వేరు నెట్‌వర్క్ సెల్స్‌కు (డిఫరెంట్ టవర్ల నుంచి కూడా) కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుందని తెలిపారు. ఇది కనెక్టివిటీని వేగవంతం చేయడంతో పాటు ఓవరాల్ పెర్ఫార్మెన్స్ను కూడా మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఏంటీ 5.5G నెట్‌వర్క్?: 5.5G నెట్‌వర్క్‌ని 5G అడ్వాన్స్‌డ్ అని కూడా పిలుస్తారు. ఇది 5G టెక్నాలజీకి తదుపరి దశ. 5Gతో పోలిస్తే ఇది మెరుగైన వేగం, తక్కువ జాప్యం (ఆలస్యం), బెటర్ నెట్‌వర్క్ రిలయబిలిటీ (నెట్‌వర్క్ విశ్వసనీయత), ఎక్స్పెన్డెడ్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ (ఇంటెలిజెంట్ సిస్టమ్స్) వంటి కొత్త మెరుగైన ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. 5.5G నెట్‌వర్క్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఇది 5G నెట్‌వర్క్ కంటే ఒక అడుగు ముందుంది. ఇది వినియోగదారుల నెట్‌వర్క్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
5.5G కమర్షియల్ రోల్అవుట్ రిలీజ్ 18తో ప్రారంభమైంది. దీన్ని ఈ అధునాతన టెక్నాలజీ ఫస్ట్ స్టెప్‌గా పరిగణిస్తారు. ఎరిక్సన్ అందించిన సమాచారం ప్రకారం.. దీన్ని ప్రీవియస్ 15, 16, 17 రిలీజ్‌ల ఆధారంగా రూపొందించారు. ఈ 5.5G నెట్‌వర్క్ రిలీజ్ 21తో మరింత మెరుగ్గా వస్తుందని తెలుస్తోంది. దీన్ని 2028 నాటికి పరిచయం చేయనున్నట్లు భావిస్తున్నారు.
5.5G నెట్‌వర్క్ లేదా 5G అడ్వాన్స్ ప్రయోజనాలు:
- 5.5G నెట్‌వర్క్ వినియోగదారులకు 5G కంటే వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది.
- 5.5G నెట్‌వర్క్ సహాయంతో వినియోగదారులు తక్కువ సమయంలోనే డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
- 5.5G నెట్‌వర్క్ అనేది 5G కంటే మెరుగైన కనెక్టివిటీ అండ్ నెట్‌వర్క్‌ని అందిస్తుంది.
- 5.5G నెట్‌వర్క్ సహాయంతో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీ ఫోన్ సిగ్నల్ ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉంటుంది.
- స్మార్ట్ సాఫ్ట్‌వేర్ 5.5G నెట్‌వర్క్‌లో కూడా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెట్‌వర్క్ మునుపటి కంటే మరింత స్మార్ట్‌గా మారనుంది.
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 మోడల్స్- పిచ్చెక్కించే డిజైన్లతో బైక్స్‌ను దింపుతున్న డుకాటి!
ఎంజీ విండ్సార్ ఈవీ ధరల పెంపు- ఫ్రీ ఛార్జింగ్ ఫెసిలిటీకి కూడా గుడ్‌బై