New MG Windsor EV Launched:ప్రపంచ దిగ్గజ కార్ల బ్రాండ్లలో ఒకటైన మోరిస్ గ్యారేజెస్ నుంచి మరో కారు వచ్చేసింది. ఎంజీ విండ్సర్ పేరుతో ఎలక్ట్రిక్ వేరియంట్లో మోరిస్ గ్యారేజెస్ దీన్ని లాంచ్ చేసింది. ఇంతకు ముందు ఎంజీ.. కామెట్, జెడ్ఎస్ ఈవీలు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేయగా.. ప్రస్తుతం మూడో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారు మూడు ట్రిమ్‌లలో, నాలుగు కలర్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.
MG Windsor EV Exterior:ఈ కారు ఎక్స్టీరియర్లో విండ్సర్ సిగ్నేచర్ కౌల్, హెడ్‌ల్యాంప్‌ల వంటి డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది. ఈ కారుకు 18-అంగుళాల క్రోమ్ అల్లాయ్ వీల్స్, ఫ్లోటింగ్ రూఫ్‌లైన్, పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. వెనుక వైపు గ్లాస్‌హౌస్ కింద కనెక్ట్ చేసిన టెయిల్‌ల్యాంప్స్, క్రోమ్ గార్నిష్‌లు ఉన్నాయి.
MG Windsor EV Interior:ఈకారులోపల క్యాబిన్‌ను లేత గోధుమరంగుపై బ్లాక్ కలర్‌తో కలిపి ఇచ్చారు. సీట్లు క్విల్టెడ్ ప్యాటర్న్‌లో ఉన్నాయి. కామెట్ కారులో ఉన్న ఓఎస్ నే ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో వాడారు. ఇందులో 15.6 అంగుళాల భారీ డిస్‌ప్లే ముందుభాగంలో హైలైట్‌గా నిలుస్తోంది. మెయిన్ హైలైట్ సీట్‌బ్యాక్ ఎలక్ట్రికల్‌గా 135 డిగ్రీల వరకు వంగి ఉంటుంది. ఇది బిజినెస్ క్లాస్ సీటింగ్ అనుభవాన్ని అందిస్తుంది. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్, వెనుక వైపు ఏసీ వెంట్లు, కప్ హోల్డర్‌లతో కూడిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్ కూడా ఇందులో ఉన్నాయి.
MG Windsor EV Features:
- విండ్సర్ టాప్-స్పెక్ వేరియంట్
- వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్
- వైర్‌లెస్ ఛార్జర్
- 360-డిగ్రీ కెమెరా
- వెనుక ఏసీ వెంట్‌లతో క్లైమేట్ కంట్రోల్
- కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ
- రిక్లైనింగ్ రియర్ సీట్
- పనోరమిక్ సన్‌రూఫ్
- మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో వాయిస్ కంట్రోల్
- జియోయాప్‌లు
- కనెక్టివిటీ
- టీపీఎంఎస్
- ఆరు ఎయిర్‌బ్యాగ్స్
- ఈబీడీతో కూడిన ఏబీఎస్
- ఫుల్ ఎల్ఈడీ లైట్ ప్యాకేజీ
- ధర: రూ. 9.9లక్షలు (ఎక్స్ షోరూం)