తెలంగాణ

telangana

ETV Bharat / technology

కొత్త ప్రైవేట్ జెట్​ కొన్న అంబానీ- ఇది విమానం కాదు.. కదిలే ఇంద్ర భవనం! - Mukesh Ambani New Private Jet

Mukesh Ambani New Private Jet: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ మరో కొత్త లగ్జరీ జెట్​ను కొనుగోలు చేశారు. ఇండియాలో అత్యంత ఖరీదైన జెట్​లలో ఒకటైన ఇది.. విమానం కాదని కదిలే ఇంద్ర భవనం అని కార్పొరేట్ ప్రపంచంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

Mukesh Ambani New Private Jet
Mukesh Ambani New Private Jet (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Sep 20, 2024, 3:47 PM IST

Updated : Sep 20, 2024, 3:56 PM IST

Mukesh Ambani New Private Jet:రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. చాలా విలాసవంతంగా జీవించే ఆయన ఏం చేసినా అది ప్రపంచ వార్తే అవుతుంది. ఇటీవలే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా తన చిన్న కుమారుడికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. తాజాగా ఆయన ఓ ప్రైవేట్ జెట్ విమానాన్ని కొనుగోలు చేసి మరో సంచలనం సృష్టించారు. ఆయన భారతదేశపు మొట్టమొదటి బోయింగ్ 737 MAX 9ని కొనుగోలు చేశారని సమాచారం. ఈ సందర్భంగా దీనిపై మరింత సమాచారం మీకోసం.

ఫ్లయింగ్ టెస్టులు:

  • ఈ బోయింగ్ 737 MAX లగ్జరీ విమానానికి ఇప్పటికే ఫ్లయింగ్ టెస్టులు పూర్తయ్యాయి.
  • 2023 ఏప్రిల్ 13 నుంచి 2024 ఆగస్టు 27 వరకు ఈ విమానం పరీక్షలు నిర్వహించారు.
  • దీనిలో క్యాబిన్ మార్పులు, ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లు సహా అనేక మార్పులు చేశారు.
  • ముకేశ్ అంబానీ దీన్ని స్విట్జర్లాండ్‌లోని యూరోఏర్‌పోర్ట్ బేసెల్-ముల్‌హౌస్-ఫ్రీబర్గ్ (BSL)లో రీమోడలింగ్ చేయించారు.

ప్రస్తుతం ఈ కొత్త విమానం ఎక్కడుందంటే?

  • ఈ బోయింగ్ విమానం స్విట్జర్లాండ్‌లో ఉండేది.
  • ఈ ప్రైవేట్ జెట్​కు బేసెల్, జెనీవా, లండన్, లుటన్ విమానాశ్రయాల్లో టెస్టింగ్ చేశారు.
  • అన్ని అప్‌గ్రేడ్‌లు పూర్తయిన తర్వాత, టెస్టులు అన్నీ పూర్తి చేసి దీన్ని ఇండియాకు తీసుకొచ్చారు.
  • ఆగస్టు 27 2024న దీన్ని బేసెల్ నుంచి దిల్లీకి తీసుకుని వచ్చారు.
  • ఇది 9 గంటల్లో 6,234 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.
  • ప్రస్తుతం ఈ కొత్త విమానం దిల్లీ ఎయిర్​పోర్టులోని కార్గో టెర్మినల్ సమీపంలో ఉన్న నిర్వహణ టెర్మినల్‌లో ఉంది.
  • రిలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ముంబయికి త్వరలో ఈ జెట్ రానుందని సమాచారం.

దీని ధర ఎంతంటే?

  • బోయింగ్ 737 MAX 9 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్‌లలో ఒకటి.
  • ఇది రెండు CFMI LEAP-18 ఇంజిన్‌లతో పనిచేస్తుంది.
  • ఈ విమానం 8401 MSN నంబర్‌ను కలిగి ఉంది.
  • 11,770 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం.
  • బోయింగ్ 737 MAX 9 ధర $118.5 మిలియన్లు.
  • అయితే ఇందులో క్యాబిన్ రెట్రోఫిటింగ్, ఇంటీరియర్ మాడిఫికేషన్ ఖర్చులు ఉండవు.
  • ఈ కొత్త జెట్ బోయింగ్ MAX 8 కంటే పెద్ద క్యాబిన్, కార్గో స్థలాన్ని కలిగి ఉంది.
  • అయితే ఈ అల్ట్రా-లాంగ్ రేంజ్ బిజినెస్ జెట్ కోసం అంబానీ ఫ్యామిలీ రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని సమాచారం.

మొత్తం 10 విమానాలు:

ముకేశ్ అంబానీకి ఒక ప్రత్యేకమైన హాబిట్ ఉంది. అదేంటంటే ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్‌ల కలెక్టింగ్.

ఇప్పటికే ఆయన వద్ద 9 ప్రైవేట్ జెట్‌లు ఉండగా తాజాగా మరో ఖరీదైన ఈ బోయింగ్ 737 MAX 9 జెట్​ను కొనుగోలు చేశారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ వద్ద బాంబార్డియర్ గ్లోబల్ 6000, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900లు, ఎంబ్రేయర్ ERJ-135 విమానాలు ఉన్నాయి.

అమెజాన్ కిక్‌స్టార్టర్‌ డీల్స్‌ రివీల్- స్మార్ట్‌ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లు ఇవే! - Amazon Announces Offers on Mobiles

మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా?- భారీ ఆఫర్లతో ఫ్లిప్​కార్ట్​లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే! - Best Smartphone in Flipkart Sale

Last Updated : Sep 20, 2024, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details