Maruti Suzuki Dzire: మారుతి సుజుకి ఎట్టకేలకు తన నాల్గో తరం మారుతి డిజైర్ సెడాన్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. కంపెనీ ఈ న్యూ జనరేషన్ మూరుతీ డిజైర్‌ను పూర్తిగా కొత్త లుక్‌లో డిజైన్ చేసింది. దీని ప్రీవియస్ మోడల్స్‌తో పోలిస్తే ఇది మరింత అగ్రెసివ్ అండ్ స్పోరీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం ఈ కొత్త మారుతి డిజైర్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.
మారుతి డిజైర్: మారుతి డిజైర్ పొడవు 4 మీటర్ల కంటే తక్కువ ఉంటుంది. ఇది 3,995 mm పొడవు, 1,735 mm వెడల్పు, 1,525 mm ఎత్తు, 2,450 mm వీల్‌బేస్, 163 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తంది. దీని పెట్రోల్ వేరియంట్ 382 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. దీని CNG ఆప్షన్ అందుబాటులో ఉంటే బూట్ స్పేస్ తగ్గుతుంది. అయితే ప్రస్తుతం దీని గురించి ఎలాంటి సమాచారం లేదు.
డిజైన్: ఈ కారును LXI, VXI, ZXI, ZXI+ వంటి మొత్తం నాలుగు ట్రిమ్‌లలో తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇది గాలంట్ రెడ్, ఆల్లరింగ్ బ్లూతో సహా మొత్తం 7 రంగులలో వస్తుంది. ఇది న్యూ జనరేషన్ మారుతి కారు స్విఫ్ట్‌కి ఫూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇండియాలో సేల్ అయిన డిజైర్ ప్రీవియస్ మూడు జనరేషన్ కార్లతో పోలిస్తే దీని డిజైన్‌లో చాలా ముఖ్యమైన మార్పులు కన్పించాయి. కొత్త మారుతి డిజైర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది హోండా అమేజ్‌ను పోలి ఉంటుంది. కంపెనీ ఈ కొత్త మారుతి డిజైర్ సెడాన్‌ను దాని ప్రీవియస్ మోడల్ కంటే ఎక్కువ ప్రీమియం ఫీచర్లతోతీసుకొచ్చింది. దీని ఇంటీరియర్ లేటెస్ట్ జనరేషన్ స్విఫ్ట్ మాదిరిగా ఉంటుంది.
2024 మారుతి డిజైర్ ఇంటీరియర్: దీని ఇంటీరియర్ సరికొత్త స్విఫ్ట్‌ను పోలి ఉంటుంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంది. ఇది వైర్‌లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేస్తుంది. కారు లోపల మీరు ఆటో క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. అంతేకాక ఈ కొత్త కారులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉంది.