BYD Sealion 7 India Launched: BYD ఇండియా తన సరికొత్త 'BYD సీలియన్ 7' SUVని దేశీయ మార్కెట్లో లాంఛ్ చేసింది. కంపెనీ దీన్ని మొదటిసారిగా ఇటీవల భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్లో ప్రదర్శించింది. ఇది నాలుగు డోర్ల ఎలక్ట్రిక్ SUV కూపే లాంటి రూఫ్‌లైన్‌ను కలిగి ఉంది. రెండు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ SUV ధరలను కూడా కంపెనీ ప్రకటించింది. దీని ధరలు మార్కెట్లో 48.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతాయి.
బుకింగ్స్ అండ్ డెలివరీస్: ఈ ఎలక్ట్రిక్ SUV బుకింగ్స్ ఇప్పటికే మార్కెట్లో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అంటే ఈ లాంఛ్ తర్వాత ఈ కొత్త 'సీలియన్ 7' భారతదేశంలో అమ్మకానికి ఉన్న అట్టో 3 (Atto 3), సీల్ (Seal), eMax7 వంటి ఇతర BYD ఉత్పత్తులతో పాటు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ కొత్త SUV డెలివరీలు మార్చి 7, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి.

బ్యాటరీ అండ్ పవర్‌ట్రెయిన్: BYD 'సీలియన్ 7' స్టాండర్డ్ 82.56kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. సింగిల్ ఛార్జ్‌తో దీని పెర్ఫార్మెన్స్ వేరియంట్ 542 కి.మీ రేంజ్, ప్రీమియం వేరియంట్ 567 కి.మీ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇక ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV పవర్ అవుట్‌పుట్ విషయానికొస్తే టాప్-స్పెక్ పెర్ఫార్మెన్స్ వెర్షన్ 523bhp, 690Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 0 నుంచి 100kmph వేగాన్ని కేవలం 4.5 సెకన్లలోనే అందుకుంటుంది.

BYD సీలియన్ 7 ఫీచర్స్: కంపెనీ ఈ BYD సీలియన్ 7 ఎలక్ట్రిక్ SUVని ఫుల్ టెక్నాలజీతో తీసుకొచ్చింది. ఇందులో 15.6-అంగుళాల రిటోటబుల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, హెడ్స్-అప్ డిస్ప్లే, 12-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, 50W వైర్‌లెస్ ఛార్జర్, డ్రైవర్ ఫెటీగ్ మానిటరింగ్ సిస్టమ్‌తో లెవల్ 2 ADAS సూట్, పవర్డ్ టెయిల్‌గేట్, 360-డిగ్రీ కెమెరాతో పాటు 11 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి.

వేరియంట్స్: కంపెనీ దీన్ని రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.
- ప్రీమియం
- పెర్ఫార్మెన్స్
ధరలు:
- BYD సీలియన్ 7 ప్రీమియం వేరియంట్ ధర: రూ. 48.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- BYD సీలియన్ 7 పెర్ఫార్మెన్స్ వేరియంట్ ధర: రూ. 54.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ప్రీమియం స్లిమ్ డిజైన్, ZEISS కెమెరాలతో వివో కొత్త ఫోన్- మిడ్ రేంజ్లో టాప్ ఇదే!
గగన్‌యాన్‌తో మరో అద్భుతానికి ఇస్రో రెడీ!- ఈ ఏడాదే మొదటి ఫ్లైట్ లాంఛ్- షెడ్యూల్ ఇదే!
మహింద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్స్ స్టార్ట్- ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు వివరాలివే!