Lava Agni 3 Launched: దసరా పండగ వేళ దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా సరికొత్త మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే అగ్ని సిరీస్‌లో రెండు మొబైల్స్‌ను లాంచ్ చేసిన లావా తాజాగా సెకండరీ డిస్‌ప్లేతో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. లావా అగ్ని3 పేరిట శుక్రవారం లాంచ్ చేసింది. సాధారణంగా అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఉండే డిస్‌ప్లేతో పాటు బ్యాక్‌సైడ్ కూడా మరో డిస్‌ప్లేతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
లావా అగ్ని3 మొబైల్లో బ్యాక్ కెమెరా పక్కనే ఈ చిన్న బ్యాక్‌సైడ్ డిస్‌ప్లే ఉంటుంది. స్టాప్‌వాచ్, అలారమ్ క్లాక్, మ్యూజిక్ ఇలా అన్నింటినీ వెనక భాగంలో డిస్‌ప్లే సాయంతో ఆపరేట్ చేసేయొచ్చు. కాల్స్ లిఫ్ట్ చేయడంతో పాటు సెల్ఫీలు కూడా తీసుకోవచ్చని లావా చెబుతోంది. మిడ్- రేంజ్‌లో యాక్షన్ బటన్‌తో వస్తున్న ఫస్ట్ ఇండియన్ మొబైల్ ఇదే అని లాంచ్ సమయంలో వెల్లడించింది. ఆండ్రాయిడ్ 14తో రిలీజ్ చేసిన ఈ సరికొత్త మొబైల్‌కు రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లను ఇస్తామని కంపెనీ చెబుతోంది.
లావా కొత్త ఫోన్ ఫీచర్లు:
- ముందువైపు 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
- వెనుకవైపు 1.74 అంగుళాల సెకండరీ డిస్‌ప్లే
- డిస్‌ప్లే:120Hz కర్వ్‌డ్
- ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7300
- మెయిన్ కెమెరా:50ఎంపీ (ఐఓఎస్)
- అల్ట్రావైడ్ కెమెరా: 8 ఎంపీ
- టెలిఫొటో లెన్స్: 8 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా: 16 ఎంపీ
- బ్యాటరీ: 5,000mAh
- 66W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం
వేరియంట్స్:
- 8జీబీ+ 128జీబీ వేరియంట్
- 8జీబీ+ 128జీబీ వేరియంట్ (ఛార్జింగ్ అడాప్టర్ లేకుండా)
- 8జీబీ+ 256జీబీ వేరియంట్ (ఛార్జింగ్ అడాప్టర్‌తో)
ధరలు:
8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర:రూ.20,999 (ఛార్జింగ్ అడాప్టర్ లేకుండా)