iphone 17 Manufacturing in India: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. తన ఐఫోన్ 17 బేస్ మోడల్ ముందస్తు తయారీనీ భారత్‌లో చేపట్టినట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చైనా నుంచి ఐఫోన్ల తయారీని ఇతర దేశాలకు యాపిల్ తరలించింది. ఈ క్రమంలో ఇప్పుడు యాపిల్ 17 ముందస్తు తయారీని తొలిసారి భారత్‌లో చేపడుతోంది.
గత కొన్నేళ్లుగా వివిధ ఐఫోన్ మోడళ్లు భారత్‌లో తయారవుతున్నాయి. ఇక్కడి నుంచి వీటిని భారీ సంఖ్యలో కంపెనీ ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 16 సిరీస్ ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. యాపిల్ ఇప్పటి వరకు ఈ తరహా తయారీని చైనాలో మాత్రమే నిర్వహించేంది. అయితే ప్రస్తుతం యాపిల్ భారత కార్యకలాపాలపై ప్రత్యేక ఆసక్తి చూపించింది.
సాధారణంగా ఒక ప్రొడక్ట్ విడుదలైన తర్వాత తయారీ చేపడుతుంటారు. అమెరికాలో యాపిల్ పార్క్‌లో నెక్ట్స్ రాబోయే ఐఫోన్ సిరీస్ మొబైల్ డిజైన్ ఖరారు అయ్యాక, కమర్షియల్ లాంచ్‌కు ముందు ఫోన్లను చైనాలో మాత్రమే ముందస్తు తయారీని ఇన్నాళ్లూ యాపిల్ చేపడుతూ వస్తోంది. అంటే పూర్తి స్థాయి తయారీకి ముందు ఉన్న ఐఫోన్లు అన్నీ చైనాలో రూపొందించినవే.