Instagram New Feature: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. దీనికి బాగా కనెక్ట్ అయిన యువత ఇన్‌స్టా రీల్స్, స్టోరీస్ చేయడంతో పాటు వాటిని షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఇన్‌స్టా న్యూ, ట్రెండింగ్ సాంగ్స్‌కు అడ్డాగా మారింది. అయితే ఇందులో అప్లికేషన్‌ను మార్చడం, సాంగ్‌ను సెర్చ్ చేసి ప్లేలిస్ట్ లేదా లైబ్రరీలో యాడ్ చేసేందుకు ఆ పాటలను మీ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌కి జోడించడం చాలా ఇబ్బంది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ తమ యూజర్లకు అదిరిపోయే అప్డేట్ తెచ్చింది.
ఇకపై కేవలం ఒక్క ట్యాప్‌తోనే ఈ ప్రాసెస్ అంతా పూర్తయేందుకు ఓ సరికొత్త ఫీచర్ ప్రారంభమైంది. ఇందుకోసం ఇన్‌స్టా స్పాటిఫైతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇకపై ఈ ఫీచర్‌తో యూజర్స్ తమ ఇన్‌స్టా స్టోరీల నుంచి సాంగ్స్‌ను నేరుగా వారి స్పాటిఫై ప్లే లిస్ట్‌కు యాడ్ చేయొచ్చు. అలాగే స్పాటిఫై ప్లే లిస్ట్‌లోని సాంగ్స్‌ను కూడా ఇన్‌స్టా స్టోరీలకు సింపుల్‌గా యాడ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్, స్పాటిఫై యూజర్స్‌కు మరింత ఇంటరాక్టివ్ అనుభవం అందించడమే లక్ష్యంగా ఈ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ మేరకు కొత్త ఫీచర్‌పై ఇన్‌స్టా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేసింది. ఈ కొత్త ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైస్‌లలో పనిచేస్తుంది.
ఇన్‌స్టా నుంచి స్పాటిఫైకి సాంగ్స్‌ను యాడ్ చేయడం ఎలా?:
- ఇన్‌స్టాగ్రామ్ రీల్, పోస్ట్ లేదా స్టోరీలో మీరు చూసిన సాంగ్‌ను స్పాటిఫైలో యాడ్ చేసేందుకు సాంగ్ స్క్రీన్‌పైకి వెళ్లేందుకు పాటపై క్లిక్ చేయండి.
- ఈ పేజ్ సాంగ్‌ను వినేందుకు, అదే ఆడియోతో చేసిన కంటెంట్‌ను చూపించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.
- ఇదే పేజీ ఇప్పుడు మీడియా ప్లేయర్ కుడి వైపున స్పాటిఫై గుర్తుతో కొత్త 'ADD' బటన్‌ను కలిగి ఉంటుంది.
- ఈ 'ADD' బటన్ మీ స్పాటిఫై లైబ్రరీకి లేదా ప్లేలిస్ట్‌కు ఒక్క ట్యాప్‌తో సాంగ్స్‌ను యాడ్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
- ఈ సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించేందుకు యూజర్స్ ఇన్‌స్టా ప్రొఫైల్‌ను స్పాటిఫై అకౌంట్‌కు కనెక్ట్ చేయాలి.
- ఈ కొత్త 'ADD' బటన్‌పై ఫస్ట్‌టైం క్లిక్ చేసినప్పుడు స్పాటిఫైని ఇన్‌స్టాగ్రామ్‌కు లింక్ చేసే ఆప్షన్ మీకు కన్పిస్తుంది.
- ఇన్ స్టాగ్రామ్ ద్వారా యాడ్ చేసిన సాంగ్స్ 'Liked Songs' ప్లే లిస్ట్‌లో, స్పాటిఫైలోని 'Your Library' ట్యాబ్ కింద కన్పిస్తాయి.