తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీ ఫోన్​తో కంప్యూటర్​ను కంట్రోల్​ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Use Remote Desktop - HOW TO USE REMOTE DESKTOP

How To Use Remote Desktop : మీ దగ్గర చాలా కంప్యూటర్లు ఉన్నాయా? ఒక కంప్యూటర్​తో మరోదానిని కంట్రోల్ చేయాలా? లేదా మీ ఫోన్​తోనే నేరుగా కంప్యూటర్​ను యాక్సెస్ చేయాలా? అయితే ఇది మీ కోసమే. రిమోట్​ డెస్క్​టాప్​ యాప్​తో మీ డివైజ్​లను దూరం నుంచి కూడా యాక్సెస్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

How to Enable and Use Remote Desktop for Windows 10
How to use Remote Desktop (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 25, 2024, 3:18 PM IST

How To Use Remote Desktop : నేడు ప్రతి ఒక్కరూ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లు వాడుతున్నారు. కానీ వాటన్నింటినీ ఒకేసారి మనతో తీసుకువెళ్లలేం కదా. ఇలాంటి సమయంలో ఒక డివైజ్​తో మరోదానిని యాక్సెస్ చేయగలిగితే ఎలా ఉంటుంది? సూపర్​గా ఉంటుంది కదా! ఇందుకు ఉపయోగపడేదే 'రిమోట్ డెస్క్​టాప్'​ ఫీచర్​.

'రిమోట్ డెస్క్‌టాప్' అంటే మన కంప్యూటర్ నుంచి లేదా ఆండ్రాయిడ్​/ ఐవోఎస్​ ఫోన్​ల నుంచి సుదూరంలోని మరో కంప్యూటర్‌ను యాక్సెస్ చేసుకోగలిగే ఒక సాంకేతిక మార్గం. ఈ ఆప్షన్‌ విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌ల్లో అందుబాటులో ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్​లో విండోస్ 11 ప్రో, విండోస్ 10 ప్రో వెర్షన్లను సపోర్ట్ చేసే డివైజ్‌ల్లో రిమోట్ డెస్క్ టాప్ ఆప్షన్‌ను ఎలా ఎనేబుల్​ చేసుకోవాలో తెలుసుకుందాం.

ఫస్ట్​ స్టెప్​

  • మనం సుదూరంగా ఉన్న మరో కంప్యూటర్‌ను యాక్సెస్ చేయాలని అనుకుంటే, తొలుత మన కంప్యూటర్​లో విండోస్ 10/ 11 ప్రో ఎడిషన్‌ ఉండేలా చూసుకోవాలి. అవతలి వైపున ఉన్న రిమోట్ కంప్యూటర్‌లో విండోస్ ప్రో లేదా విండోస్ హోం వెర్షన్‌ ఏది ఉన్నా ఫర్వాలేదు.
    ఒక వేళ ఆ రిమోట్ కంప్యూటర్ వేరే ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసేదైనా ఏ సమస్యా ఉండదు.
  • రిమోట్ డెస్క్‌టాప్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసేందుకు, ముందుగా ‘Start’ బటన్​ను నొక్కాలి. తరువాత ‘Settings’ను ఓపెన్ చేయాలి. System అనే విభాగంలో About అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, మీ విండోస్ వెర్షన్ వివరాలు కనిపిస్తాయి. అందులో విండోస్ 10 ప్రో లేదా విండోస్​ 11 ప్రో ఉందో, లేదో చూడాలి. ఒక వేళ లేకపోతే, విండోస్​ 10 ప్రో లేదా విండోస్​ 11 ప్రోనకు అప్​గ్రేడ్​ కావాలి.
  • సదరు కంప్యూటర్​కు కచ్చితంగా ఓ 'పేరు' పెట్టుకోవాలి.
  • ఇది పూర్తైన తరువాత, మళ్లీ కంప్యూటర్‌లోని Start బటన్​పై క్లిక్ చేసి, Settingsను ఓపెన్ చేయాలి.
  • అక్కడ మీకు Remote Desktop అని కనిపిస్తుంది. దాన్ని మీరు ‘On’ చేసి, తరువాత ‘Confirm’పై క్లిక్ చేయాలి. అంతే సింపుల్​!

సెకండ్​ స్టెప్​

  • మీరు ఏ కంప్యూటర్​ను అయితే యాక్సెస్ చేయాలని అనుకుంటున్నారో, దానికి కూడా ఒక పేరు పెట్టాలి.
  • మీ విండోస్ కంప్యూటర్‌ టాస్క్‌బార్‌పై ఉండే సెర్చ్ బాక్స్‌లో Remote Desktop Connection అని టైప్ చేయాలి. అది ఓపెన్ అయ్యాక మీరు రిమోట్‌గా కనెక్ట్ చేయాలని భావిస్తున్న కంప్యూటర్ పేరును టైప్ చేయాలి. ఆ తర్వాత Connect అనే ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. అంతే సింపుల్​! ఇకపై మీకు చాలా సుదూరంలో ఉన్న కంప్యూటర్​ను కూడా మీ డివైజ్​తోనే యాక్సెస్ చేయవచ్చు. దానిని కంట్రోల్ కూడా చేయవచ్చు.

ఫోన్ ద్వారా కంప్యూటర్​ను కంట్రోల్ చేయండిలా!
Remote Desktop app లాంటి యాప్స్​ను ఉపయోగించి, మీ ఫోన్ ద్వారా కంప్యూటర్​ను యాక్సెస్ చేయవచ్చు లేదా కంట్రోల్ చేయవచ్చు. ఇందుకోసం మీరు గూగుల్​ ప్లే, మ్యాక్​ యాప్​స్టోర్​, మైక్రోసాఫ్ట్​ స్టోర్ నుంచి Remote Desktop app డౌన్లోడ్ చేసుకోవాలి. దానిని మీ డివైజ్​లో ఇన్​స్టాల్ చేసుకోవాలి. తరువాత మీ కంప్యూటర్​కు ఒక పేరు పెట్టాలి. తరువాత దానికి ఒక PIN సెట్ చేసుకోవాలి. అంతే సింపుల్​!

ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి Remote Desktop app ఓపెన్ చేయాలి. మీరు యాక్సెస్ చేయాలని అనుకుంటున్న కంప్యూటర్ పేరు, పిన్​ ఎంటర్​ చేయండి. అంతే సింపుల్! సదరు కంప్యూటర్​ మీ కంట్రోల్​లోకి వచ్చేస్తుంది.

వాట్సాప్‌లో 'ఎయిర్ డ్రాప్' తరహా ఫీచర్ - ఇక మెరుపువేగంతో ఫైల్స్ ట్రాన్స్‌ఫర్! - WhatsApp AirDrop Like Feature

లాక్​డౌన్​ మోడ్​తో మీ ఫోన్ మరింత సేఫ్- ఎలా యాక్టివేట్​ చేయాలో తెలుసా? - Lock Down Mode Android

ABOUT THE AUTHOR

...view details